Raj Kundra: ‘నన్ను బలిపశువును చేశారు.. ఛార్జ్‌షీట్‌లో ఒక్క ఆధారమూ లేదు’

అశ్లీల చిత్రాల నిర్మాణం, ప్రసారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ వ్యాపారవేత్త, నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా.. శనివారం కోర్టులో బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ వ్యవహారంలో యాక్టివ్‌గా పాల్పంచుకున్నట్లు అనుబంధ...

Published : 19 Sep 2021 01:26 IST

ముంబయి: అశ్లీల చిత్రాల నిర్మాణం, ప్రసారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ వ్యాపారవేత్త, నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా.. శనివారం కోర్టులో బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ వ్యవహారంలో అనుబంధ ఛార్జ్‌షీట్‌లో తనపై ఒక్క ఆధారం కూడా లేదని, తనను ఈ కేసులో బలిపశువుగా మార్చారని ఆయన దరఖాస్తులో వాపోయారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ముంబయి క్రైమ్ బ్రాంచ్.. ఇటీవల రాజ్ కుంద్రా, మరో ముగ్గురిపై అనుబంధ ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసిన విషయం తెలిసిందే. సినిమా అవకాశాల కోసం ముంబయికి వచ్చే యువతులను వంచించి రాజ్‌కుంద్రా పెద్దఎత్తున ఆర్జించినట్లు అందులో పేర్కొన్నారు.  ఈ కేసు విషయంలో విచారణ ముగిసినందున బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన మెట్రోపాలిటన్ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తప్పుగా చిక్కుకున్నానని, ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేకపోయినా.. పోలీసులే లాగారని ఆయన ఆరోపించారు. ఇప్పటివరకు జరిగిన విచారణ కూడా.. తాను ఎలాంటి నేరానికి పాల్పడలేదని స్పష్టంగా చూపిస్తోందన్నారు. దీంతోపాటు కంటెంట్‌ అప్‌లోడ్, ప్రసారం చేసే ప్రక్రియతోనూ సంబంధం లేదని స్పష్టం చేస్తోందని పేర్కొన్నారు. సోమవారం కోర్టు ఈ పిటిషన్‌పై విచారణ జరపనుంది. రాజ్‌ కుంద్రా ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని