
Rajasthan: ఈ క్రూరమైన పదవి నాకొద్దు.. రాజస్థాన్ సీఎంకు మంత్రి ట్వీట్
జైపుర్: అంతర్గత విభేదాలతో సతమతమవుతోన్న రాజస్థాన్ కాంగ్రెస్‌కు ఇప్పుడు మరో తలనొప్పి మొదలైంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ ప్రధాన కార్యదర్శి తీరుతో అసంతృప్తికి గురైన రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి అశోక్ చాంద్నా ట్విటర్ వేదికగా దాన్ని బయటపెట్టారు. ప్రధాన కార్యదర్శే అన్ని శాఖలకు మంత్రిలాగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. అలాంటప్పుడు ఈ మంత్రి పదవి తనకు వద్దంటూ అసహనం వ్యక్తం చేశారు.
‘‘ఈ క్రూరమైన మంత్రి పదవి నుంచి నాకు విముక్తి కల్పించి.. నా శాఖలన్నింటినీ కుల్దీప్ రంకా(ప్రధాన కార్యదర్శి)కి అప్పగించాలని ముఖ్యమంత్రిని అభ్యర్థిస్తున్నా. ఎలాగూ అన్ని శాఖలకు ఆయనే మంత్రి కదా..!’’ చాంద్నా చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మరికొద్ది రోజుల్లో రాజస్థాన్‌లో రాజ్యసభ ఎన్నికలు జరగనున్న వేళ చాంద్నా ఆరోపణలు.. కాంగ్రెస్‌లో లుకలుకలను మరోసారి బయటపెట్టాయి.
ఇదిలా ఉండగా.. వారం రోజుల క్రితమే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు రాజీనామా చేశారు. భూపంపిణీ విషయంలో రాష్ట్ర అధికారులతో విభేదాలు రావడంతో ఎమ్మెల్యే గణేశ్ ఘోగ్రా అసంతృప్తికి గురయ్యారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ అధికారులు తన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ తన పదవికి రాజీనామా చేశారు. ఈ వరుస ఘటనలు రాజస్థాన్‌లో హస్తం పార్టీకి తలనొప్పిగా మారాయి.
మరోవైపు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై సొంత పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తుండటంతో ప్రతిపక్ష భాజపా విమర్శలకు దిగింది. ‘‘ఈ నౌక(గహ్లోత్ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ) మునిగిపోతోంది. 2023 ఎన్నికల ట్రెండ్స్ వచ్చేస్తున్నాయి’’ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సతీశ్ పునియా కాంగ్రెస్‌పై వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. రాజస్థాన్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs ENG: పుజారా అర్ధశతకం.. మూడో రోజు ముగిసిన ఆట
-
General News
Health: చిగుళ్ల ఆరోగ్యంతోనే దంతాల మెరుపు
-
Sports News
Rishabh Pant: వికెట్ కీపర్లలో పంత్.. బ్రియాన్ లారా: పాక్ మాజీ కెప్టెన్
-
India News
Manipur landslide: 37కు చేరిన మణిపుర్ మృతుల సంఖ్య.. ఇంకా లభించని 25 మంది ఆచూకీ..!
-
General News
Mayocarditis: గుండె కండరం వాచినా కష్టాలే సుమా..!
-
Politics News
Samajwadi Party : సమాజ్‌వాది పార్టీ పునర్వ్యవస్థీకరణ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- IND vs ENG: పుజారా అర్ధశతకం.. మూడో రోజు ముగిసిన ఆట
- IND vs ENG: బుమ్రా స్టన్నింగ్ క్యాచ్.. బెన్‌స్టోక్స్‌ను ఎలా ఔట్ చేశాడో చూడండి
- Virat Kohli: బెయిర్‌స్టో క్యాచ్ పట్టాక.. కోహ్లీ ఫ్లయింగ్ కిస్ వీడియో..!
- Viral tweet: ‘క్యాబ్‌లో నేను ఇంటికి వెళ్లే ఖర్చుతో విమానంలో గోవా వెళ్లొచ్చు!’
- Anand Mahindra: హర్ష గొయెంకా ‘గ్రేట్ మెసేజ్’కు.. ఆనంద్ మహీంద్రా రియాక్ట్!
- Ante Sundaraniki: డేట్ సేవ్ చేసుకోండి.. ‘అంటే.. సుందరానికీ!’.. ఆరోజే ఓటీటీలోకి
- Rishabh Pant: వికెట్ కీపర్లలో పంత్.. బ్రియాన్ లారా: పాక్ మాజీ కెప్టెన్
- PM Modi: తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారుకు ప్రజలు పట్టాలు వేస్తున్నారు: మోదీ
- IndiGo: ఒకేరోజు వందల మంది ఉద్యోగులు ‘సిక్‌లీవ్’..! 900 సర్వీసులు ఆలస్యం
- Weekly Horoscope : రాశిఫలం ( జులై 03 - 09 )