ఒంటెక్కి వెళ్లిటీకా.. ఆరోగ్యకార్యకర్త చొరవ

హర్‌ ఘర్‌ దస్తక్‌ టీకా డ్రైవ్‌లో భాగంగా రాజస్థాన్‌లోని బార్మర్‌ జిల్లాలో మహిళా ఆరోగ్య కార్యకర్త ఒంటెపై వెళ్లి టీకా వేసి ప్రశంసలందుకున్నారు...

Published : 24 Dec 2021 19:24 IST

బార్మర్‌: హర్‌ ఘర్‌ దస్తక్‌ టీకా డ్రైవ్‌లో భాగంగా రాజస్థాన్‌లోని బార్మర్‌ జిల్లాలో ఓ మహిళా ఆరోగ్య కార్యకర్త ఒంటెపై వెళ్లి టీకా వేసి ప్రశంసలందుకున్నారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ వేగంగా విస్తరిస్తున్న వేళ టీకా విలువ తెలిపేలా.. ఒంటెపై వెళ్లి టీకా వేయడం అందరి దృష్టినీ ఆకర్షించింది. ప్రస్తుతం కొత్త వేరియంట్లు ప్రబలుతున్న నేపథ్యంలో టీకా వేసుకోని వారందరూ తప్పకుండా వేసుకోవాలని ఈ కార్యకర్త చొరవ సూచిస్తోంది. మహిళా ఆరోగ్య కార్యకర్త చొరవను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ట్విటర్‌లో అభినందించారు. ఒంటెపై వెళ్లి గ్రామంలోని ఓ వ్యక్తికి టీకా వేసిన చిత్రాలను షేర్‌ చేశారు. నెటిజన్లు సైతం ఆమెకు సామాజిక మాధ్యమాల్లో అభినందనలు తెలుపుతున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని