Rajasthan: వారంతా నిర్దోషులే.. రాజస్థాన్‌ హైకోర్టు సంచలన తీర్పు!

2008 జైపూర్‌ (Jaipur) వరుస పేలుళ్లలో కేసులో రాజస్థాన్‌ హైకోర్టు (Rakasthan High Court) రద్దు చేసింది. ఈ కేసులో నిందితులకు ట్రయల్‌ కోర్టు విధించిన ఉరిశిక్షను రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది.

Published : 30 Mar 2023 00:19 IST

జైపూర్‌: 2008 జైపూర్‌ (Jaipur) వరుస బాంబు పేలుళ్ల కేసులో రాజస్థాన్‌ హైకోర్టు (Rajasthan High Court) సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులకు ట్రయల్‌ కోర్టు విధించిన ఉరిశిక్షను రద్దు చేసింది. 2019లో ట్రయల్‌ కోర్టు విధించిన ఉరిశిక్షను సవాల్‌ చేస్తూ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తులు జస్టిస్‌ పంకజ్‌ భండారీ, జస్టిస్‌ సమీర్‌ జైన్‌లతో కూడిన ధర్మాసనం కింది కోర్టు ఇచ్చిన ఉరిశిక్షను రద్దు చేస్తూ  తీర్పు వెలువరించింది. 

2008లో జైపూర్‌లో పలు ప్రాంతాల్లో వరుస బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 71 మంది మృతిచెందగా.. 185 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసులో మొత్తం 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ముగ్గురు హైదరాబాద్‌, దిల్లీ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. ఇద్దరు బట్లా హౌస్‌ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. మిగిలిన నలుగురు జైపూర్‌ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ కేసులో 1,293 మంది వాంగ్మూలం నమోదు చేసిన పోలీసులు మహ్మద్‌ సల్మాన్‌, మహ్మద్‌ సైఫ్‌, సర్వార్‌ అజ్మీ, అన్సారీ అనే నలుగురిని  నిందితులుగా పేర్కొంటూ ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ట్రయల్‌ కోర్టు నలుగురిని నిందితులుగా తేలుస్తూ వారికి ఉరిశిక్ష విధించింది. తాజాగా ఆ శిక్షను రాజస్థాన్‌ హైకోర్టు రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు