Updated : 15/01/2022 16:03 IST

Rajdhani Express: ముంబయి-దిల్లీ ‘రాజధాని’కి తప్పిన పెను ప్రమాదం.. పట్టాలు తప్పించేందుకు దుశ్చర్య?

గాంధీనగర్‌: ముంబయి నుంచి దిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. ఈ రైలు శుక్రవారం రాత్రి గుజరాత్‌లోని వల్సాడ్‌ సమీపంలో రైల్వే ట్రాక్‌పై ఉంచిన సిమెంట్ స్తంభాన్ని ఢీకొట్టింది. రాత్రి 7.10 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని, ఇందులో ఎవరికీ గాయాలు కాలేదని పోలీసులు శనివారం వెల్లడించారు. అయితే, ఈ రైలును ఉద్దేశపూర్వకంగానే పట్టాలు తప్పించే ప్రయత్నం జరిగినట్లు అనుమానిస్తున్నామని వారు వెల్లడించారు. ‘ముంబయి- హజ్రత్ నిజాముద్దీన్ ఆగస్టు క్రాంతి రాజధాని ఎక్స్‌ప్రెస్.. వల్సాడ్‌ దగ్గర్లోని అతుల్ రైల్వేస్టేషన్‌కు సమీపంలో రైల్వే ట్రాక్‌పై ఉంచిన సిమెంట్ స్తంభాన్ని ఢీకొట్టింది. వెంటనే ఆ స్తంభం పట్టాలపైనుంచి పక్కకు జరిగిపోయింది. ఈ ఘటన రైలు ప్రయాణంపై ఎటువంటి ప్రభావం చూపలేదు. ప్రయాణికులెవరూ గాయపడలేదు. లోకో పైలట్ వెంటనే అతుల్ రైల్వేస్టేషన్ సిబ్బందికి సమాచారం అందించారు’ అని వల్సాడ్‌ రూరల్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు.

సమాచారం అందుకున్న వెంటనే అప్రమత్తమైన రైల్వే ఉన్నతాధికారులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు సూరత్ ఐజీ రాజ్‌కుమార్ పాండియన్ తెలిపారు. రైలును పట్టాలు తప్పించేందుకే ఇలా చేసినట్లు తెలుస్తోందని.. ఈ విషయమై పోలీసులు విచారణ జరుపుతున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై వల్సాడ్‌ రూరల్‌ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. సాంకేతిక ఆధారాలతో నిందితులను పట్టుకునేందుకు యత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఇటీవలే పశ్చిమ బెంగాల్‌లో బికనేర్‌- గువాహటి ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. ప్రమాదంలో ఏడు బోగీలు పూర్తిగా ధ్వంసం కాగా, ఇప్పటివరకు తొమ్మిది మంది మృతి చెందారు. ప్రమాద ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని