ఆర్మీ క్యాంటీన్‌ వస్తువులు ఇకపై ఆన్‌లైన్‌లో

భారత సైన్యంలో పనిచేస్తున్న సిబ్బందికి కేంద్రం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఇకపై సీఎస్‌డీల్లో (క్యాంటీన్‌ స్టోర్స్‌ డిపార్ట్‌మెంట్‌) లభించే ఖరీదైన వస్తువులను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే వీలు కల్పించింది. దీనికి సంబంధించిన పోర్టల్‌ను.....

Updated : 08 Jan 2021 15:51 IST

దిల్లీ: భారత సైన్యంలో పనిచేస్తున్న సిబ్బందికి కేంద్రం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఇకపై సీఎస్‌డీల్లో (క్యాంటీన్‌ స్టోర్స్‌ డిపార్ట్‌మెంట్‌) లభించే ఖరీదైన వస్తువులను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే వీలు కల్పించింది. దీనికి సంబంధించిన పోర్టల్‌ను (https://afd.csdindia.gov.in) రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ శుక్రవారం ప్రారంభించారు. సుమారు 45 లక్షల మంది సిబ్బంది ఏఎఫ్‌డీ-1 కేటగిరీలోని వస్తువులను ఈ పోర్టల్‌ ద్వారా కొనుగోలు చేసే సౌలభ్యం కలగనుంది.

వాషింగ్‌ మెషీన్లు, మైక్రో ఓవెన్లు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్‌ కండీషన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు వంటివి ఏఎఫ్‌డీ-1 కేటగిరీ కిందకు వస్తాయి. ఈ కేటగిరీ కిందకు వచ్చే ఎయిర్‌ప్యూరిఫైయర్లు, హోం థియేటర్లు, మొబైల్‌ ఫోన్స్‌ కూడా ఆన్‌లైన్‌ ద్వారా కొనుగోలు చేయొచ్చు. సైన్యంలో పనిచేస్తున్న వారితో పాటు ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ కూడా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. జవాన్ల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, డిజిటల్‌ ఇండియాలో భాగంగా ఈ పోర్టల్‌ను తీసుకొచ్చామని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఈ సందర్భంగా ట్వీట్‌ చేశారు.

ఇవీ చదవండి..

కరోనా అని.. విమానమంతా బుక్‌ చేసుకుని!

భారత్‌ బయోటెక్ నుంచి మరో టీకా!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని