Rajnath Singh: భారత్‌లో ఆయుధ తయారీ అవకాశాలు పరిశీలించండి..!

భారత్‌లో ఆయుధ తయారీ అవకాశాలు పరిశీలించాలని అమెరికా దిగ్గజ సంస్థలు బోయింగ్‌, రేథియేన్‌ సంస్థల ప్రతినిధులను రక్షణశాఖ

Published : 11 Apr 2022 12:19 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌లో ఆయుధ తయారీ అవకాశాలు పరిశీలించాలని అమెరికా దిగ్గజ సంస్థలు బోయింగ్‌, రేథియేన్‌ సంస్థల ప్రతినిధులను రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కోరారు. అమెరికా పర్యటనలో భాగంగా ఆయన నిన్న ఆయా కంపెనీల సీనియర్‌ అధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ మాట్లాడుతూ.. మేకిన్‌ ఇండియా నుంచి ‘మేక్‌ ఫర్‌ ది వరల్డ్‌’ దిశగా మళ్లేందుకు భారత్‌లోని పెట్టుబడుల విధానాల్లో చేసిన మార్పుల లబ్ధిని అందిపుచ్చుకోవాలని కోరారు.

ఈ పర్యటనలో రాజ్‌నాథ్‌ సింగ్‌ వెంట విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ కూడా ఉన్నారు. వారిద్దరు నేడు వాషింగ్టన్‌లో జరగనున్న 2+2 చర్చల్లో పాల్గొననున్నారు. బైడెన్‌ అధికారం చేపట్టిన తర్వాత ఈ విధానంలో వాషింగ్టన్‌లో భారత్‌తో జరుగుతోన్న తొలి చర్చలు ఇవే. అమెరికా తరఫున అక్కడి స్టేట్‌ ఆఫ్‌ సెక్రటరీ ఆంటోనీ బ్లింకన్‌, డిఫెన్స్‌ సెక్రటరీ లాయిడ్‌ ఆస్టిన్‌ పాల్గొననున్నారు. ఉక్రెయిన్‌ సంక్షోభం కొనసాగుతోన్న సమయంలో జరగనున్నఈ చర్చలకు చాలా ప్రాధాన్యం ఉంది. రష్యాతో సంబంధాలు తగ్గించుకోవాలని అమెరికా.. భారత్‌పై ఒత్తిడి తెస్తోన్న వేళ ఈ చర్చల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకొంటారో అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ కూడా భారత్‌ ప్రధాని మోదీతో వర్చువల్‌ విధానంలో భేటీ కానున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని