Rajnath Singh: లెఫ్టినెంట్‌ కర్నల్‌ హర్జీందర్‌ సింగ్‌కు రాజ్‌నాథ్‌ నివాళి

తమిళనాడులో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన 13మందిలో ఒకరైన లెఫ్టినెంట్‌  కర్నల్‌ హర్‌జిందర్‌ సింగ్‌ భౌతికకాయానికి  రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, సహాయ మంత్రి అజయ్‌భట్‌, త్రివిధ దళాల అధిపతులు ఆదివారం తుది నివాళులర్పించారు. అంతిమ సంస్కారాలకు...

Published : 12 Dec 2021 23:43 IST

దిల్లీ: తమిళనాడులో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన 13మందిలో ఒకరైన లెఫ్టినెంట్‌  కర్నల్‌ హర్‌జిందర్‌ సింగ్‌ భౌతికకాయానికి  రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, సహాయ మంత్రి అజయ్‌భట్‌, త్రివిధ దళాల అధిపతులు ఆదివారం తుది నివాళులర్పించారు. అంతిమ సంస్కారాలకు ముందు దిల్లీ కంటోన్మెంట్‌లోని బ్రార్‌ స్క్వేర్‌లో హర్‌జిందర్‌ సింగ్‌ భౌతిక కాయంపై రాజ్‌నాథ్‌ సింగ్‌ పుష్పగుచ్ఛంతో నివాళులర్పించారు. అనంతరం కర్నల్‌ సింగ్‌ సతీమణి మాజ్‌ అగ్నెస్‌ మనేజస్‌, కుమార్తె ప్రీత్‌కౌర్‌లను పరామర్శించారు.

ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవణె, ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వివేక్‌ రామ్‌ చౌధరి, నేవీ అడ్మిరల్‌ హరికుమార్‌, ఇతర సైనికాధికారులు  నివాళులర్పించారు. సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌కు స్టాఫ్‌ ఆఫీసర్‌గా సేవలందించిన హర్జిందర్‌ సింగ్‌ 11 గూర్ఖా రైఫిల్స్‌కు చెందిన అధికారి.  సీడీఎస్‌దీ ఇదే రెజిమెంట్‌. సియాచిన్‌పై భద్రతాదళాల మోహరింపు, ఐరాస శాంతి పరిరక్షక మిషన్‌, బెటాలియన్‌ ఆపరేషన్‌లలో సేవలందించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు