Rajnath Singh: ఉగ్రవాదులకు రాజ్‌నాథ్‌ సింగ్‌ స్ట్రాంగ్ వార్నింగ్‌!

దేశంలో ఏదో ఒకరకంగా నిత్యం అలజడి సృష్టించి శాంతిని దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తోన్న ఉగ్ర మూకలకు .......

Published : 24 Apr 2022 01:44 IST

గువాహటి: దేశంలో ఏదో ఒకరకంగా నిత్యం అలజడి సృష్టించి శాంతిని దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తోన్న ఉగ్ర మూకలకు కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. దేశ సరిహద్దు ద్వారా భారత్‌ను టార్గెట్‌ చేసే ఉగ్రవాదుల పని పట్టేందుకు అవసరమైతే సరిహద్దులు దాటేందుకు సైతం వెనుకాడబోమని హెచ్చరించారు. 1971 భారత్‌-పాకిస్థాన్‌ యుద్ధంలో పాల్గొన్న అసోంకు చెందిన వెటరన్స్‌ సన్మాన సభ సందర్భంగా ఆయన గువహటిలో కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం నుంచి ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా కేంద్రం పనిచేస్తోందన్నారు. ఉగ్రవాద చర్యల్ని కఠినంగా తిప్పికొడతామనే సందేశం ఇవ్వడంలో భారత్‌ విజయవంతమైందని తెలిపారు. బయటి నుంచి దేశాన్ని టార్గెట్‌ చేస్తే సరిహద్దుల్ని దాటేందుకు సైతం వెనుకాడబోమన్నారు. దేశ పశ్చిమ సరిహద్దుతో పోలిస్తే తూర్పు సరిహద్దుల్లో శాంతి, సుస్థిరత నెలకొందని వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్‌ వైపు నుంచి చొరబాటు సమస్య దాదాపు ముగిసిపోయిందన్న రాజ్‌నాథ్‌ సింగ్‌.. భారత్‌కు మిత్ర దేశం గనక తూర్పు సరిహద్దులో శాంతి, స్థిరత్వం నెలకొందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని