రక్షణ కొనుగోళ్లకు కొత్త విధానం 

దేశంలోని రక్షణ రంగ పరికరాలు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం కొత్తవిధానాన్ని అమల్లోకి తెచ్చింది. నేడు జరిగిన డిఫెన్స్‌ అక్విజేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తోపాటు సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌, ఆర్మీ చీఫ్‌ నరవాణే, వాయుసేన చీఫ్‌ బదౌరియా,

Published : 28 Sep 2020 19:17 IST

దిల్లీ: దేశంలోని రక్షణ రంగ పరికరాలు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం కొత్తవిధానాన్ని అమల్లోకి తెచ్చింది. నేడు జరిగిన డిఫెన్స్‌ అక్విజేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తోపాటు సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌, ఆర్మీ చీఫ్‌ నరవాణే, వాయుసేన చీఫ్‌ బదౌరియా, నావికాదళాధిపతి కరమ్‌బీర్‌ సింగ్‌ పాల్గొన్నారు. ఈ సమావేశంలో త్రివిధ దళాలు ఆయుధాల కొనుగోలు విధానాలను మరింత సులభతరం చేశారు. 
భారత్‌ చైనా మధ్య ఎల్‌ఏసీ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్న సమయంలో జరిగిన ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకొంది. వచ్చే ఐదేళ్లలో 130 బిలియన్‌ డాలర్లు విలువైన క్యాపిటల్‌ ప్రొక్యూర్మెంట్‌ (ఆయుధ కొనుగోళ్లు)  జరగవచ్చని ఆంగ్ల వార్త సంస్థ పీటీఐ పేర్కొంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని