OBC bill: ఓబీసీ బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం

ఓబీసీల జాబితా రూపకల్పనలో రాష్ట్రాలకు ఇదివరకు ఉన్న అధికారాలను పునరుద్ధరించడానికి వీలు కల్పించే 105వ రాజ్యాంగ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు ఇప్పటికే లోక్‌సభ ఆమోదం తెలపగా.. బుధవారం రాజ్యసభలో సైతం విపక్ష సభ్యులు

Updated : 11 Aug 2021 19:34 IST

దిల్లీ: ఓబీసీల జాబితా రూపకల్పనలో రాష్ట్రాలకు ఇదివరకు ఉన్న అధికారాలను పునరుద్ధరించడానికి వీలు కల్పించే 127వ రాజ్యాంగ సవరణ బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు ఇప్పటికే లోక్‌సభ ఆమోదం తెలపగా.. బుధవారం రాజ్యసభలో సైతం విపక్ష సభ్యులు ఏకతాటిపైకొచ్చి ఈ బిల్లుకు ఆమోదం తెలిపారు. రాజ్యసభలో ఈ బిల్లును సామాజిక న్యాయం-సాధికారత శాఖ మంత్రి  వీరేంద్రకుమార్‌ ప్రవేశపెట్టారు. బిల్లు ఆమోదం అనంతరం ప్రధాని మోదీ సహా వివిధ పార్టీల నేతలకు ధన్యవాదాలు తెలిపారు. ఇదొక చరిత్రాత్మక అడుగు అని, దేశంలో 671 కులాలు దీనిద్వారా రిజర్వేషన్ల ప్రయోజనాన్ని పొందనున్నాయని చెప్పారు.

బీమా బిల్లుకూ ఆమోదం
ప్రభుత్వరంగ బీమా సంస్థలను ప్రైవేటీకరించేందుకు వీలుగా తీసుకొచ్చిన ది జనరల్‌ ఇన్సూరెన్స్‌ బిజినెస్‌ (నేషనలైజేషన్‌) సవరణ బిల్లు-2021కు పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. లోక్‌సభలో ఆగస్టు 2న ఈ బిల్లుకు ఆమోదం లభించగా.. బుధవారం విపక్షాల ఆందోళన నడుమ రాజ్యసభలోనూ ఆమోదం పొందింది. తృణమూల్‌, డీఎంకే, వామపక్ష పార్టీలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి. సెలక్ట్‌ కమిటీకి పంపాలని పట్టుబడ్డాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ బిల్లును ప్రతిపాదించగా.. నిరసనలే మధ్య మూజువాణి ఓటుతో ఈ బిల్లుకు ఆమోద ముద్ర పడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని