నిరవధికంగా రైతు నిరసనలు : టికాయత్‌

రైతు నిరసనలను నిరవధికంగా కొనసాగిస్తామని బీకేయూ నాయకుడు రాకేశ్‌ టికాయత్‌ వెల్లడించారు.

Published : 12 Feb 2021 15:56 IST

దిల్లీ: సాగు చట్టాల రద్దు కోరుతూ దేశ రాజధాని దిల్లీ సరిహద్దుల్లో చేపట్టిన నిరసనలను నిరవధికంగా కొనసాగిస్తామని ‘భారతీయ కిసాన్‌ యూనియన్‌’ (బీకేయూ) నాయకుడు రాకేశ్‌ టికాయత్‌ వెల్లడించారు. నిరసనలు ఎంతకాలం కొనసాగించాలనే వ్యవధిపై నిర్ణయమేదీ తీసుకోలేదని.. ఇవి అక్టోబర్‌ వరకూ కొనసాగవచ్చని ఆయన తెలిపారు. అంతేకాకుండా ప్రతి ఏడాది గాంధీ జయంతి రోజున రైతు నిరసన ప్రదర్శనలు చేపడతామని ప్రకటించారు.

‘’ఈ వ్యవసాయ చట్టాలు రైతులకు అమోదయోగ్యం కావు. వాటిని రద్దు చేయకపోవటం వెనుక ఉన్న కారణం ఏమిటో వివరించాలి’’ అని ప్రభుత్వాన్ని టికాయత్‌ డిమాండ్‌ చేశారు. 

రైతు నిరసనలపై పార్లమెంటులో చర్చ జరగటంపై టికాయత్‌ హర్షం వ్యక్తం చేశారు. దేశాన్ని నడిపిస్తోంది నలుగురే అన్న రాహుల్‌ వ్యాఖ్యలతో ఆయన ఏకీభవించారు. తమ ప్రదర్శన అక్టోబర్‌ వరకూ కొనసాగుతుందని.. మరో రైతు సంఘం ‘సంయుక్త్‌ కిసాన్‌ మోర్చా’ నేత  గుమ్‌నాబ్‌ సింగ్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇవీ చదవండి..

ఆ ట్రాక్టర్లతో రైతులకు రూ.లక్ష ఆదా..

కేంద్రం, ట్విటర్‌కు సుప్రీం నోటీసులు

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని