Ramdev Baba: దుస్తులు లేకపోయినా.. మహిళలు బాగుంటారు: రాందేవ్‌బాబా వివాదాస్పద వ్యాఖ్యలు

ప్రముఖ యోగా గురువు రామ్‌దేవ్‌ బాబా మహిళల గురించి తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దుస్తులు వేసుకోకపోయినా వారు బాగుంటారని పేర్కొన్నారు.

Updated : 26 Nov 2022 13:49 IST

ఠానే: ప్రముఖ యోగా గురువు రామ్‌దేవ్‌ బాబా మహిళల గురించి తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దుస్తులు వేసుకోకపోయినా వారు బాగుంటారని పేర్కొన్నారు. మహారాష్ట్రలోని ఠాణెలో పతంజలి యోగా పీఠం, ముంబయి మహిళల పతంజలి యోగా సమితి సంయుక్తంగా శుక్రవారం యోగా సైన్స్‌ శిబిరాన్ని నిర్వహించాయి. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ భార్య అమృతా ఫడణవీస్‌ సహా పలువురు మహిళలు దానికి హాజరయ్యారు. యోగా శిక్షణ కార్యక్రమం ముగిసిన వెంటనే అక్కడ ఓ ప్రత్యేక సమావేశం జరిగింది. దీంతో- యోగా దుస్తుల్లో వచ్చిన మహిళలకు.. వాటిని మార్చుకొని, చీరల వంటివి ధరించేందుకు సమయం దొరకలేదు. ఆ పరిస్థితిపై స్పందించిన రామ్‌దేవ్‌.. ఇంటికి వెళ్లాక చీరలు ధరించొచ్చని పేర్కొన్నారు. స్త్రీలు చీరల్లో, సల్వార్‌ సూట్‌లలో అందంగా ఉంటారని.. తన కళ్లకైతే, వారు అసలేం ధరించకపోయినా బాగుంటారని నోరు జారారు. ఆయన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని