Published : 13 May 2022 10:51 IST

Ranil Wickremesinghe: థ్యాంక్యూ మోదీజీ.. భారత్‌ సహాయాన్ని ప్రస్తావించిన శ్రీలంక కొత్త ప్రధాని

సన్నిహిత సంబంధాల కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడి

కొలంబో: ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోన్న శ్రీలంకలో రాజకీయ అనిశ్చితికి కాస్త తెరపడింది. ఈ క్రమంలో కొత్తగా ప్రధాని పీఠం ఎక్కిన రణిల్ విక్రమసింఘె.. భారత్‌తో సన్నిహిత సంబంధాల కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. తన దేశం ఎదుర్కొంటోన్న క్లిష్ట పరిస్థితులను అధిగమించేందుకు భారత్ అందిస్తోన్న తోడ్పాటుపై కృతజ్ఞతలు తెలియజేశారు. 

 ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జరిగిన కార్యక్రమంలో విక్రమసింఘె మాట్లాడుతూ.. ‘నేను భారత్‌తో సన్నిహిత సంబంధాలు కోరుకుంటున్నాను. భారత ప్రధాని నరేంద్రమోదీకి కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటున్నాను’ అంటూ మనదేశం అందిస్తోన్న సహాయం గురించి ప్రస్తావించారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఈ ద్వీపదేశాన్ని ఆదుకునేందుకు భారత్ వివిధ రూపాల్లో 3 బిలియన్ల డాలర్లను అందించేందుకు ముందుకు వచ్చింది. ఇప్పటికే బియ్యం, చమురు వంటి అత్యవసరాలను పంపిన సంగతి తెలిసిందే.  

శ్రీలంక పార్లమెంటులో ఒకేఒక్క సీటు ఉన్న యూఎన్‌పీ అగ్రనేత రణిల్ గురువారం ప్రధాని పదవి చేపట్టారు. తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభం కారణంగా దేశమంతటా పెల్లుబికిన నిరసనలకు తలొగ్గి ప్రధాని పదవికి మహీంద రాజపక్స సోమవారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనంతరం నూతన ప్రధానమంత్రి నియామక ప్రక్రియకు ఉపక్రమించిన దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స.. ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు నేతలతో విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. చివరకు రణిల్‌ను ప్రధాని మంత్రిగా నియమిస్తున్నట్లు నిన్న ప్రకటించారు. నూతన ప్రధానితో కలిసి పనిచేసేందుకు భారత్‌ ఎదురుచూస్తోందని కొలంబోలో భారత హైకమిషన్ ఇంతకుముందే ఓ ప్రకటనలో పేర్కొంది.    

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts