Published : 28 Jun 2022 02:08 IST

Sonia Gandhi: సోనియా గాంధీ వ్యక్తిగత కార్యదర్శిపై అత్యాచారం కేసు!

దిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ వ్యక్తిగత సహాయకుడిపై అత్యాచార కేసు నమోదైంది. ఓ మహిళ ఫిర్యాదు మేరకు సోనియా వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్న పీపీ మాధవన్‌పై దిల్లీ పోలీసులు రేప్‌ కేసు నమోదు చేశారు. అత్యాచారంతో పాటు మాధవన్‌పై బెదిరింపు అభియోగాలూ మోపారు. పెళ్లి పేరుతో మాధవన్‌ తనను మోసం చేశాడని, శారీరకంగా లొంగదీసుకున్నాడని ఆ మహిళ ఉత్తమ్‌నగర్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

తన భర్త దిల్లీలోని కాంగ్రెస్‌ కార్యాలయంలో పనిచేసేవాడని, అతడు 2020లో మృతిచెందినట్లు సదరు మహిళ ఫిర్యాదులో పేర్కొంది. భర్త మృతి అనంతరం ఆ పని ఇప్పించాలని మాధవన్‌ని సంప్రదిస్తే.. పెళ్లి పేరుతో వేధించాడని పేర్కొంది. అనంతరం మరుమార్లు తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదులో తెలిపింది. కాగా పోలీసులు 376, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని