Swati Maliwal: స్వాతి మాలివాల్‌కు అత్యాచార బెదిరింపులు!
సాజిద్ ఖాన్ (Sajid Khan)ని బిగ్‌బాస్(Bigg Boss) నుంచి తప్పించాలని డిమాండ్ చేసిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో తనకు అత్యాచార బెదిరింపులు వస్తున్నాయని స్వాతి మాలివాల్ (Swati Maliwal) ఫిర్యాదు చేశారు.
దిల్లీ: దేశ రాజధాని దిల్లీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ స్వాతి మాలివాల్ (Swati Maliwal) పోలీసులను ఆశ్రయించారు. రియాల్టీ షో బిగ్‌బాస్ (Bigg Boss) నుంచి సినీ దర్శకుడు సాజిద్ ఖాన్ని తప్పించాలని డిమాండ్ చేస్తూ కేంద్రానికి లేఖ రాసిన తర్వాత తనకు ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యాచార బెదిరింపులు వస్తున్నాయంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేయాలని దిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులను ఆమె కోరారు. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్‌కు ఈ నెల10న లేఖ రాసిన స్వాతి మాలివాల్.. సాజిద్‌ను షో నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. మీటూ ఉద్యమంలో కొందరు మహిళలు సాజిద్ ఖాన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయాన్నీ ప్రస్తావించారు. 2018లో దేశంలో కొనసాగిన మీటూ ఉద్యమం సమయంలో పది మందికి పైగా సినీ తారలు, మోడళ్లు, పాత్రికేయులు సాజిద్ ఖాన్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన విషయం తెలిసిందే. దాంతో అప్పుడు ఏడాది పాటు సినిమాలకు దర్శకత్వం వహించకుండా సాజిద్‌ను సస్పెండ్ చేసిన విషయాన్ని స్వాతి మాలివాల్ పేర్కొన్నారు.
కానీ, సాజిద్ ఇమేజ్ను తిరిగి పెంచే ప్రయత్నంలో భాగంగా తాజాగా పాపులర్ టీవీ షో బిగ్‌బాస్‌లో హౌస్‌మేట్‌గా చేర్చారని స్వాతి మండిపడ్డారు. ‘‘అక్టోబర్ 10న లేఖ రాసినప్పటి నుంచి స్వాతి మాలివాల్ ఇన్స్టాగ్రామ్ ఖాతాకు ఆన్లైన్లో బెదిరింపులు వస్తున్నాయని, ఆమెపై అత్యాచారం చేస్తామంటూ బెదిరిస్తున్నారు’’ అని పేర్కొన్నారు. తనకు వస్తున్న బెదిరింపులపై స్పందించిన స్వాతి.. సాజిద్ ఖాన్‌కు వ్యతిరేకంగా తక్షణమే చర్యలు తీసుకొని ఆయన్ను షో నుంచి తొలగించి శాశ్వతంగా నిషేధం విధించాలని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌ని కోరారు. మీటూ ఉద్యమంలో భాగంగా తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పిన వారికి అండగా నిలబడినందుకు తనకు అత్యాచారం బెదిరింపులు వస్తున్నాయని.. ఇది మహిళా కమిషన్ని భయపెట్టడానికి, చట్టబద్ధమైన పనిని అడ్డుకునేందుకు చేస్తోన్న ప్రయత్నంగానే చూడాలన్నారు.
ఈ వ్యవహారంపై దిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశానని.. ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితులను అరెస్టు చేయాలని ఆమె కోరారు. నా పని చేసినందు నాకే అత్యాచార బెదిరింపులు వస్తుంటే.. ఇక మీటూ ఉద్యమంలో తమకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టిన వారి పరిస్థితి ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చని స్వాతి ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Vishnu Priya: యాంకర్ విష్ణు ప్రియ ఇంట విషాదం
-
India News
Flight: అసహనంతో ‘విమానం హైజాక్’ అంటూ ట్వీట్
-
Movies News
Jamuna: అలనాటి నటి జమున కన్నుమూత
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
India News
Marriage: 28 ఏళ్ల కోడలిని పెళ్లాడిన 70 ఏళ్ల మామ
-
Sports News
Australian open: కెరీర్ చివరి మ్యాచ్‌లో సానియాకు నిరాశ.. మిక్స్డ్ డబుల్స్‌లో ఓటమి