తమిళనాడు గవర్నర్‌గా రవిశంకర్‌ ప్రసాద్‌?

తమిళనాడు గవర్నర్‌గా కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ నియమితులయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం గవర్నర్‌గా ఉన్న భన్వర్‌లాల్‌ పురోహిత్‌ స్థానంలో..

Updated : 10 Jul 2021 19:42 IST

దిల్లీ: తమిళనాడు గవర్నర్‌గా కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ నియమితులయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం గవర్నర్‌గా ఉన్న భన్వర్‌లాల్‌ పురోహిత్‌ స్థానంలో రవిశంకర్ ప్రసాద్‌ను గవర్నర్‌గా నియమించనున్నట్టు సమాచారం. ఇప్పటికే భన్వర్‌లాల్‌ పురోహిత్‌ను దిల్లీకి పిలిపించి  చర్చించినట్టు తెలుస్తోంది.  కేంద్ర మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణలో భాగంగా కేంద్ర ఐటీశాఖ మంత్రిగా ఉన్న రవిశంకర్‌ ప్రసాద్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఆయన్ను తమిళనాడు గవర్నర్‌గా నియమించాలని కేంద్రం భావిస్తున్నట్ట సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని