Delhi Airport: ప్రయాణ సమయానికి మూడున్నర గంటల ముందు దిల్లీ ఎయిర్‌పోర్టుకు రండి..!

దిల్లీ విమానాశ్రయంలో రద్దీని దృష్టిలో ఉంచుకొని ఇండిగో ఎయిర్‌లైన్స్‌ కీలక ప్రకటన జారీ చేసింది. 

Published : 13 Dec 2022 14:46 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దిల్లీలోని ఇందిరా గాంధీ ఎయిర్‌పోర్టు నుంచి దేశీయంగా విమాన ప్రయాణం చేయాల్సిన వారు కనీసం 3.5 గంటల ముందు విమానాశ్రయానికి చేరుకోవాలని ఇండిగో ఎయిర్‌లైన్స్‌ తన ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేసింది. 7 కిలోల లోపు బరువుండే ఒకే బ్యాగ్‌తో వస్తే వీలైనంత త్వరగా సెక్యూరిటీ క్లియరెన్స్‌ లభిస్తుందని పేర్కొంది. ఇప్పటికే అధికారులు ఈ విమానాశ్రయంలో ట్రాఫిక్‌ను తగ్గించేందుకు కీలక చర్యలు తీసుకొన్నారు. ఉదయం రద్దీ వేళల్లో విమానాల సంఖ్యను తగ్గించనున్నారు. దీంతోపాటు కొన్ని విమానాలను టెర్మినల్‌-3 నుంచి మళ్లించనున్నారు.

ఇండిగో ఎయిర్‌లైన్స్‌ తన అడ్వైజరీలో పలు విషయాలను ప్రయాణికులతో పంచుకొంది. చెక్‌ఇన్‌, బోర్డింగ్‌కు అనుకున్నదాని కంటే ఎక్కువ సమయం పట్టొచ్చని పేర్కొంది. ప్రయాణికులు వారి వెబ్‌ చెక్‌ఇన్‌ను పూర్తిచేసుకొని రావాలని సూచించింది. ఇందిరాగాంధీ విమానాశ్రయంలోని టీ3లోకి ప్రవేశించడానికి గేట్‌ నం:5, గేట్‌ నం: 6 మార్గాలను ఎంచుకోవాలని కోరింది.  దిల్లీ విమానాశ్రయంపై  ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సోమవారం అక్కడ సందర్శించారు. టెర్మినల్‌-3లో ఏర్పాట్లతోపాటు అక్కడి పరిస్థితులను పరిశీలించారు. అధికారులతో చర్చించి.. పరిస్థితులను చక్కదిద్దేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని