Sharad Pawar: శరద్ పవార్‌ను బెదిరిస్తూ.. సుప్రియా సూలేకు వాట్సప్ మెసేజ్
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ (Sharad Pawar)ను బెదిరిస్తూ కొందరు ఆగంతకుల తనకు మెసేజ్ చేశారని ఆయన కుమార్తె సుప్రియా సూలే తెలిపారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ముంబయి: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధ్యక్షుడు శరద్ పవార్ (Sharad Pawar)కు బెదిరింపులు వచ్చాయి. తన తండ్రిని బెదిరిస్తూ వాట్సప్‌లో తనకు మెసేజ్ వచ్చినట్లు పవార్ కుమార్తె, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే (Supriya Sule) తెలిపారు. దీంతో ఆమె ముంబయి పోలీసులను ఆశ్రయించారు.
దీనిపై తాజాగా ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘గురువారం నాకు ఈ బెదిరింపు మెసేజ్ (Threat Message) వచ్చింది. ఓ వెబ్‌సైట్ ద్వారా పవార్‌ను బెదిరిస్తూ ఆగంతకులు సందేశం పంపారు. దీంతో నేను పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఈ విషయంలో మహారాష్ట్ర హోం మంత్రి, కేంద్ర హోంమంత్రి త్వరితగతిన జోక్యం చేసుకోవాలి. పవార్‌జీ ఈ దేశ నేత. ఆయన భద్రత బాధ్యత కేంద్ర హోంశాఖదే. దీనిపై అమిత్ షా చర్యలు తీసుకోవాలి. ఇలాంటి చర్యలు నీచ రాజకీయాలకు నిదర్శనం. ఇవి వెంటనే ఆగాలి’’ అని సుప్రియా డిమాండ్ చేశారు.
అయితే, ఈ మెసేజ్ ఎవరు పంపారన్నది ఇంకా తెలియరాలేదు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Rahul Gandhi: భారాస అంటే భాజపా రిస్తేదార్ సమితి: రాహుల్
-
TDP: ‘ఐప్యాక్‌కు రూ.274 కోట్లు అప్పనంగా దోచిపెట్టారు’
-
Jangaon: విద్యుత్తు స్తంభంపై కార్మికుని నరకయాతన
-
దిల్లీ మద్యం కేసులో అప్రూవర్లుగా మాగుంట రాఘవ్, దినేష్ అరోరా
-
RK Roja: తెదేపాను వీడినప్పటి నుంచి కక్ష కట్టారు: మంత్రి రోజా
-
YS Jagan: రేపు దిల్లీకి సీఎం జగన్.. హఠాత్తుగా సామర్లకోట పర్యటన వాయిదా