టీకాల పురోగతి ఆశా కిరణంలా ఉంది: గుటెర్రస్‌

కరోనా వైరస్ టీకాల అభివృద్ధికి సంబంధించి ఇటీవల సాధించిన పురోగతిని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ ‘ఆశాకిరణం’గా అభివర్ణించారు.

Published : 21 Nov 2020 17:17 IST

న్యూయార్క్‌: కరోనా వైరస్ నివారణ టీకాల అభివృద్ధికి సంబంధించి ఇటీవల సాధించిన పురోగతిని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ ‘ఆశాకిరణం’గా అభివర్ణించారు. ఈ టీకాలు ప్రతి ఒక్కరికి అందుబాటులోకి రావాలని, ఔషధాలు, చికిత్సల అభివృద్ధికి జీ-20 దేశాలు సహకరించాలని కోరారు. తమ టీకా 95 శాతం సమర్థత కలిగి ఉందని, వృద్ధుల్లో కూడా మంచి పనితీరు కనబరుస్తుందని ఔషధ సంస్థ పైజర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

‘కరోనా టీకా అభివృద్ధిలో సాధించిన పురోగతి ఆశా కిరణంలా కనిపిస్తోంది. అయితే, ఆ కిరణాలు అందరికి చేరాల్సిన అవసరం ఉంది. టీకాలను ప్రపంచ వినిమయ వస్తువులుగా పరిగణిస్తున్నామని నిర్ధారించాల్సి ఉంది. అవి అందరికి, అన్నిచోట్లా అందుబాటులో ఉండాలి. మహమ్మారిని నిలువరించడానికి ఇదే ఏకైక మార్గం. టీకా తయారీ, పంపిణీకి నిధులు చాలా కీలకం. జీ-20 దేశాలకు వనరులున్నాయి. ఆ దేశాలు సహకరించాలని అభ్యర్థిస్తున్నాను’ అని ఓ మీడియా సమావేశంలో మాట్లాడారు. కాగా, ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటివరకు 5.7 కోట్ల మందికిపైగా ఆ వైరస్ బారిన పడగా, 13,71,241 మరణాలు సంభవించాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని