తైవాన్‌పై దండెత్తిందా అనిపించేట్లు..
తైవాన్ ఎయిర్ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్ (ఏడీఐజెడ్)లోకి రికార్డు స్థాయిలో చైనా విమానాలు చొరబడ్డాయి. వీటిల్లో న్యూక్లియర్ బాంబులను జారవిడిచే బాంబర్లు కూడా ఉన్నాయి.
ఇంటర్నెట్‌డెస్క్: తైవాన్ ఎయిర్ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్ (ఏడీఐజెడ్)లోకి భారీ స్థాయిలో చైనా విమానాలు చొరబడ్డాయి. వీటిలో అణు బాంబులను జారవిడిచే బాంబర్లు కూడా ఉన్నాయి. మొత్తం 25 విమానాలు తమ గగనతలంలోకి చొరబడినట్లు సోమవారం తైవాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది ఇదే అత్యధిక విమానాల చొరబాటని వెల్లడించింది. తైవాన్ విషయంలో దూకుడుగా ఉంటే చర్యలు తప్పవని అమెరికా హెచ్చరించిన నేపథ్యంలో ఇది జరగడం గమనార్హం. ఆదివారమే అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకన్ చైనా దూకుడు చర్యలపై స్పందించారు.. ఆ మర్నాడే చైనా విమనాలు తైవాన్ గగనతలంలోకి ప్రవేశించాయి.
తాజాగా మొత్తం 18 ఫైటర్ జెట్ విమానాలు, రెండు నుంచి నాలుగు న్యూక్లియర్ బాంబర్లు, రెండు యాంటీ సబ్‌మెరైన్ వార్ఫేర్ విమానాలు, ఒక ఎర్లీ వార్నింగ్ విమానం.. ఈ బృందంలో ఉన్నట్లు తైవాన్ వెల్లడించింది. ఇటీవల తైవాన్ సముద్ర జలాలు, ఆ దేశ ఆధీనంలోని ద్వీపాల సమీపంలోకి చైన్ జెట్ విమానాల సంచారం పెరిగిపోయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన నిధులు తన వద్ద లేవని.. అందుకే పార్టీ ప్రతిపాదనను తిరస్కరించానని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. -
26/11 హీరో సదానంద్ వసంత్ దాటేకు ఎన్ఐఏ పగ్గాలు
కేంద్ర దర్యాప్తు సంస్థ నూతన అధిపతిగా సదానంద్ వసంత్ దాటే నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. -
ఈ మూడు విషయాలే ఆరోగ్యకర జీవన రహస్యం.. డాక్టర్ ఫార్ములా షేర్ చేసిన హర్ష గోయెంకా
ఆరోగ్యకరమైన జీవనానికి ఏం చేయాలో ఓ డాక్టర్ చెబుతున్న సీక్రెట్ ఫార్ములా వీడియోను హర్ష గోయెంకా ఎక్స్‌లో షేర్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్‌లో నమోదైన రికార్డులివీ..
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్‌తో కృతి సనన్
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
-
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
-
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా