Drone: పాక్‌ నుంచి దూసుకొచ్చిన డ్రోన్‌ !.. కూల్చివేసిన బలగాలు

పాక్‌ నుంచి భారత్‌ భూ భాగంలోకి వచ్చిన డ్రోన్‌ను భారత్‌ బలగాలు కూల్చివేశాయి. సంఘటన స్థలం నుంచి ఎకే సిరీస్‌ రైఫిల్‌తోపాటు 2 మేగజైన్లు, 40 రౌండ్ల బుల్లెట్‌లను స్వాధీనం చేసుకున్నారు.

Published : 10 Mar 2023 23:46 IST

అమృత్‌సర్‌: పంజాబ్‌ (Punjab)లోని గురుదాస్‌పూర్‌ జిల్లా మెల్టా ప్రాంతంలో భారత్‌-పాక్‌ సరిహద్దులో డ్రోన్‌ (Drone) కలకలం రేపింది. పాక్‌ నుంచి భారత్‌ భూభాగంలోకి దూసుకొచ్చిన డ్రోన్‌ను భద్రతా బలగాలు కూల్చివేశాయి. గురువారం అర్ధరాత్రి ఇరుదేశాల బోర్డర్‌లో పహారా కాస్తున్న సరిహద్దు భద్రతాబలగాలకు (BSF) ఓ శబ్దం వినిపించింది. పాకిస్థాన్‌ (Pakistan) భూభాగం నుంచి డ్రోన్‌ వస్తోందని గమనించిన సైన్యం వెంటనే అప్రమత్తమై దానిని కూల్చివేసింది. డ్రోన్‌ను కూల్చివేసినట్లు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చిన సైన్యం.. ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టింది. డ్రోన్‌ కూలిన పరిసర ప్రాంతాల్లో  ఒక ఏకే సిరీస్‌ రైఫిల్‌తోపాటు 2 మేగజైన్లు, 40 రౌండ్ల బుల్లెట్‌లను స్వాధీనం చేసుకున్నారు. భారత్‌లోకి అక్రమంగా ఆయుధాలను రవాణా చేసి ఉగ్రవాద చర్యలకు పాల్పడేందుకు పాక్‌ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని భారత్‌ సైన్యం  ఆరోపించింది. అక్రమ ఆయుధాలను సరఫరా చేసేందుకు పాక్‌ చేసిన కుటిల యత్నాలను మరోసారి భగ్నం చేశామని వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని