Portugal: అఫ్గాన్‌ సంగీత కళాకారులకు పోర్చుగల్ ఆశ్రయం

తాలిబన్ల పాలనలో తమ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన వందల మంది అఫ్గానిస్థాన్‌ సంగీత కళాకారులకు పోర్చుగల్ ఆశ్రయమిచ్చింది.

Published : 14 Dec 2021 23:51 IST

లిస్బన్‌: తాలిబన్ల పాలనలో భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన వందల మంది అఫ్గానిస్థాన్‌ సంగీత కళాకారులకు పోర్చుగల్ ఆశ్రయమిచ్చింది. తాలిబన్లు అధికారంలోకి రాగానే అఫ్గాన్ అంతటా సంగీత ప్రదర్శనలపై నిషేధం విధించారు. ఈ ఆంక్షలతో చాలా మంది కళాకారులు దేశం విడిచి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇలా స్వదేశం విడిచిన వందలాది అఫ్గానిస్థాన్‌ సంగీత కళాకారులకు పోర్చుగీసు అధికారులు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. ఇప్పుడు తాము సురక్షితంగా ఉన్నామని శరణార్థులు వెల్లడించారు. భవిష్యత్తులో మళ్లీ తమ దేశానికి వెళ్లి సంగీత కచేరీలు నిర్వహించాలన్నదే తమ కల అని 18 ఏళ్ల షోగుఫా షఫీ తెలిపారు.

Read latest National - International News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని