
Updated : 15 Mar 2022 15:41 IST
CoWIN: 12-14 ఏళ్ల వారికి కరోనా టీకా.. కొవిన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోండిలా..
దిల్లీ: కేంద్రం మార్చి 16 నుంచి కరోనా టీకా కార్యక్రమంలో మరో దశను ప్రారంభించనుంది. 12 నుంచి 14 ఏళ్ల వయస్సున్న పిల్లలకు టీకా ఇవ్వనుంది. బయోలాజికల్ ఇ సంస్థ అభివృద్ధి చేసిన కార్బెవాక్స్ టీకాను ఈ వయస్సు వారికి అందించనుంది. ఈ టీకా పంపిణీ ప్రక్రియలో భాగంగా.. 12 ఏళ్లు పైబడినవారు రేపటి నుంచి కొవిన్ ప్లాట్‌ఫాంలో రిజిస్టర్ చేసుకోవచ్చు.
- అందుకోసం www.cowin.gov.in లోకి వెళ్లి పేరు నమోదు చేసుకోవాలి. తర్వాత అందులో Register Yourself అనే బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మొబైల్ నంబరు రాస్తే ఫోన్‌కు ఒక ఓటీపీ వస్తుంది.
- ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే రిజిస్ట్రేషన్ పేజీకి వెళ్తుంది. అక్కడ మీ పేరు, వయసు, పుట్టినతేదీ వంటి వివరాలు ఎంటర్ చేయాలి. దీంతో పాటు ఏదో ఒక ధ్రువీకరణ పత్రం అప్లోడ్ చేయాలి. ఆధార్ కార్డులు అందుబాటులోని పక్షంలో పిల్లలు తమ విద్యార్థి ఐడీ కార్డులను ఉపయోగించవచ్చు.
- పిల్లలు వారి కుటుంబ సభ్యులతో లేదా విడిగా నమోదు చేసుకోవచ్చు. ఒక కుటుంబంలోని నలుగురు సభ్యులు ఒక మొబైల్ నంబర్‌తో నమోదు ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
- రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత మీ అకౌంట్ వివరాలు కనిపిస్తాయి. ఆ తర్వాత టీకా కోసం అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. ‘Schedule appointment’ అని బటన్ క్లిక్ చేస్తే అపాయింట్మెంట్ పేజీకి వెళ్తుంది. అక్కడ రాష్ట్రం, జిల్లా, పిన్‌కోడ్ ఎంటర్ చేసి మీ సమీపంలోని టీకా పంపిణీ కేంద్రాలను తెలుసుకోవచ్చు. ఆ జాబితా నుంచి ఒక కేంద్రాన్ని ఎంచుకుంటే అందుబాటులో ఉన్న స్లాట్స్ చూపిస్తుంది. వాటిలో నుంచి సమయం, తేదీని ఎంచుకుని కింద ఉండే Book బటన్‌ను క్లిక్ చేస్తే అపాయింట్మెంట్ లభిస్తుంది.
ఇవీ చదవండి
Tags :
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Bypolls: యూపీలో భాజపాకు బిగ్ బూస్ట్.. పంజాబ్‌లో ఆప్‌కు భంగపాటు
-
General News
Telangana News: 28న తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
General News
Telangana News: ఆ మహిళకు ఆర్టీసీ బస్సే ఆసుపత్రి... డ్రైవరే డాక్టరు
-
India News
Agnipath scheme: ‘అగ్నిపథ్’పై వెనక్కి తగ్గని కేంద్రం.. కోటా సంగతి తేల్చని రాష్ట్రాలు..!
-
Business News
E Passport: ఈ పాస్‌పోర్ట్‌లు వస్తున్నాయ్.. ఎప్పటి నుంచి జారీ చేస్తారు?ఎలా పనిచేస్తాయి?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- మా ఆయన కోసం సల్మాన్‌ఖాన్‌ని వదులుకున్నా!
- Yuvraj Singh - RaviShastri: ఆరోజు యువరాజ్ ఐదో సిక్సర్ కొట్టగానే..: రవిశాస్త్రి
- Actor Sai kiran: మోసం చేశారంటూ పోలీస్‌స్టేషన్‌లో సినీ నటుడు సాయికిరణ్ ఫిర్యాదు
- Atmakur ByElection: ఆత్మకూరు ఉపఎన్నిక.. వైకాపా ఏకపక్ష విజయం
- Weddings: వివాహాల్లో భారీ అలంకరణలు, డీజే సౌండ్లు బంద్.. వరుడు క్లీన్ షేవ్ చేసుకోవాల్సిందే..
- R Madhavan: మాధవన్‌పై నెటిజన్ల విమర్శలు.. సైన్స్ తెలియకపోతే సైలెంట్‌గా ఉండు..!
- AP Liquor: మద్యంలో విషం
- Rohit Sharma: టీమ్ఇండియాకు షాక్.. రోహిత్ శర్మకు కరోనా
- ప్రశ్నించానని పాలు, నీళ్లు లేకుండా చేశారు