ఛాయ్‌వాలా.. పద్మశ్రీ ప్రకాశ్‌రావు కన్నుమూత

ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు, ఛాయ్‌వాలా, పద్మశ్రీ గ్రహీత డి.ప్రకాశ్‌రావు (63) కన్నుమూశారు. కరోనా సోకడంతో డిసెంబర్‌ చివరి వారంలో

Published : 13 Jan 2021 18:23 IST

కటక్‌: ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు, ఛాయ్‌వాలా, పద్మశ్రీ అవార్డు గ్రహీత డి.ప్రకాశ్‌రావు (63) కన్నుమూశారు. కరోనా సోకడంతో డిసెంబర్‌ చివరి వారంలో కటక్‌లోని ఎస్‌సీబీ వైద్యకళాశాల- ఆస్పత్రిలో చేరిన ఆయన.. దాదాపు 20 రోజుల పాటు చికిత్సపొందుతూ ప్రాణాలు విడిచారు. ఆయన ఆరోగ్యం మరింతగా విషమించడంతో ఐసీయూలో చికిత్స అందించినా ఫలితం లేకపోయిందని వైద్యులు వెల్లడించారు. తేనీరు విక్రయంతో వచ్చిన సంపాదనతో కటక్‌లోని మురికివాడల్లో చిన్నారులకు విద్య, ఆహారం అందించి ఆయన ప్రశంసలు అందుకున్నారు.

 

ఆయన మన తెలుగువారే..
130 ఏళ్ల క్రితం ప్రకాశ్‌రావు పూర్వీకులు ప్రకాశం జిల్లా నుంచి వెళ్లి కటక్‌లో స్థిరపడ్డారు. దీంతో ప్రకాశ్‌రావు అక్కడే టీ స్టాల్‌ నడుపుతూ తనకు వచ్చిన ఆదాయంలో సగం మొత్తాన్ని వెచ్చించి కటక్‌లో ‘ఆశా ఓ ఆశ్వాసన’ అనే పాఠశాలను కూడా నడిపి విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారు. 1978 నుంచి 200 సార్లుకు పైగా రక్తదానం చేయడం, పేదలను ఆదుకోవడం.. ఇలా అనేక సామాజిక సేవా కార్యక్రమాలతో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2019లో పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. అంతకముందు ప్రధాని నరేంద్ర మోదీ మన్‌కీ బాత్‌లో ప్రకాశ్‌రావు పేరును ప్రస్తావిస్తూ చేసిన సేవలను కొనియాడారు. అంతేకాకుండా ఒడిశా పర్యటనకు వెళ్లిన సందర్భంలో కూడా ఆయనను కలిశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని