Published : 29/11/2021 22:49 IST

Rahul Gandhi: ‘చర్చలకు అనుమతి ఇవ్వకుంటే పార్లమెంట్‌ ప్రయోజనం ఏంటి?’

దిల్లీ: పార్లమెంట్‌లో ఎలాంటి చర్చ జరపకుండానే మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును ఆమోదించడాన్ని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు. కేంద్రం తీరు చూస్తుంటే భయంతో ఉన్నట్లు, ఏదో తప్పు చేసినట్లు తెలుస్తోందని వ్యాఖ్యానించారు. వ్యవసాయ చట్టాల రద్దు.. రైతుల విజయం, దేశ విజయంగా అభివర్ణించారు. విపక్షాల ఆందోళనల మధ్య ఈ చట్టాల రద్దు బిల్లును పార్లమెంట్‌ ఉభయ సభలు ఆమోదించిన కొద్దిసేపటికే ఆయన మీడియాతో మాట్లాడారు. 

‘కేంద్రం భయపడుతోంది..’

‘మేం ఎంఎస్‌పీ సమస్యపై, లఖింపుర్ ఖేరీ ఘటనపై చర్చించాలనుకున్నాం. నిరసనల్లో మృతి చెందిన 700 మంది రైతుల గురించి, ఈ చట్టాల వెనుక ఉన్న శక్తుల గురించి మాట్లాడాలనుకున్నాం. కానీ.. దురదృష్టవశాత్తు చర్చలకు అనుమతించలేదు. కేంద్ర ప్రభుత్వం భయపడుతోంది.. దాక్కోవాలనుకుంటోంది.. అనేదానికి ఇదే నిదర్శనం’ అని రాహుల్‌ గాంధీ ఎద్దేవా చేశారు. చర్చలకు అనుమతి ఇవ్వకుంటే పార్లమెంట్‌ ప్రయోజనం ఏంటని నిలదీశారు. ‘సాగు చట్టాల రద్దు విషయంలో రైతుల పోరాటాన్ని కేంద్ర ప్రభుత్వం ఎదుర్కోలేకపోయిందనేది వాస్తవం. రాబోయే ఆయా రాష్ట్రాల ఎన్నికలు కూడా కేంద్రం మనస్సులో మెదిలి ఉండొచ్చు!’ అని అన్నారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్