Police Medals: 901 మందికి పోలీసు పతకాలు.. ఆంధ్రప్రదేశ్‌కు 17, తెలంగాణకు 15

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ పోలీసు పతకాలు ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో ఏపీ నుంచి 17, తెలంగాణ నుంచి 15 మందికి ఈ పతకాలు దక్కాయి.

Updated : 24 Jan 2024 17:11 IST

దిల్లీ: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ.. సైనిక, పోలీసు అధికారులకు వివిధ పతకాలను ప్రకటించింది. దేశవ్యాప్తంగా 901 మందికి పోలీసు పతకాలు (Police Medals) అందజేయనుంది. ఈ మేరకు బుధవారం అవార్డుల జాబితాను విడుదల చేసింది. 140 మందికి పోలీస్‌ మెడల్‌ ఫర్‌ గ్యాలంట్రీ (పీఎంజీ), 93 మంది పోలీసులకు రాష్ట్రపతి పోలీసు పతకాలు(పీపీఎం), 668 మందికి పోలీస్‌ విశిష్ట సేవా (పోలీసు మెడల్‌ ఫర్‌ మెరిటోరియస్‌ సర్వీస్‌) పతకాలను ప్రకటించింది.

గ్యాలంట్రీ పతకాలు (Gallantry Medals) దక్కించుకున్న 140 మందిలో అత్యధికంగా 48 మంది సీఆర్పీఎఫ్‌ పోలీసులు ఉన్నారు. మహారాష్ట్ర నుంచి 31 మంది, జమ్మూకశ్మీర్‌ నుంచి 25, ఝార్ఖండ్‌ నుంచి 9, దిల్లీ నుంచి 7, ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఏడుగురు పోలీసులకు గ్యాలంట్రీ పురస్కారాలు దక్కాయి. ఈసారి అత్యున్నత రాష్ట్రపతి పోలీసు మెడల్‌ ఫర్‌ గ్యాలంట్రీ (పీపీఎంజీ) పురస్కారం.. పోలీసు దళాల్లో ఎవరికీ ప్రకటించలేదు.

తెలుగు రాష్ట్రాల పోలీసులకు ఇలా..

ఈ అవార్డుల్లో ఆంధప్రదేశ్‌ నుంచి 17, తెలంగాణ నుంచి 15 మందికి పోలీసు పతకాలు దక్కాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఇద్దరికి రాష్ట్రపతి పోలీసు పతకం (పీపీఎం), 15 మందికి విశిష్ట సేవా పతకాలు ప్రకటించారు. తెలంగాణలో ఇద్దరికి రాష్ట్రపతి పోలీసు పతకం (పీపీఎం), 13 మందికి పోలీస్‌ విశిష్ట సేవాల పతకాలు (పీఎం) ఇవ్వనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ నుంచి అదనపు డీజీ అతుల్‌ సింగ్‌, 6వ బెటాలియన్‌ రిజర్వ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ సంగం వెంకటరావు, తెలంగాణ నుంచి అదనపు డీజీ అనిల్‌ కుమార్‌, 12వ బెటాలియన్‌ అదనపు కమాండెంట్‌ బృంగి రామకృష్ణ రాష్ట్రపతి పతకాలు అందుకోనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని