శశి థరూర్‌, పాత్రికేయులపై 3 రాష్ట్రాల్లో కేసులు

గణతంత్ర దినోత్సవం రోజున దిల్లీలో రైతులు తలపెట్టిన ట్రాక్టర్ల ర్యాలీ ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శశిథరూర్‌, సీనియర్‌ పాత్రికేయులు రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌, మ్రిణాల్‌ పాండే సామాజిక మాధ్యమాల్లో అసత్య సమాచారం వ్యాప్తి చేశారని, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో వారిపై పలువురు కేసులు పెట్టారు.

Updated : 24 Jan 2024 17:21 IST

దిల్లీ/చంఢీగడ్‌: గణతంత్ర దినోత్సవం రోజున దిల్లీలో రైతులు తలపెట్టిన ట్రాక్టర్ల ర్యాలీ ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శశిథరూర్‌, సీనియర్‌ పాత్రికేయులు రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌, మ్రిణాల్‌ పాండే సామాజిక మాధ్యమాల్లో అసత్య సమాచారం వ్యాప్తి చేశారని, ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో వారిపై పలువురు కేసులు పెట్టారు. తాజాగా హరియాణాలోనూ కూడా వీరిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. పరువునష్టం, తప్పుదోవ పట్టించే ట్వీట్లు చేసినందుకుగారు వీరిపై కేసులు పెట్టినట్లు ఫిర్యాదుదారుల్లో ఒకరైన మహాబిర్‌ సింగ్ తెలిపారు. 

గణతంత్ర దినోత్సవం నాడు రైతులు శాంతియుతంగా నిర్వహిస్తున్న ట్రాక్టర్ల ర్యాలీ ఉన్నట్టుండి దారి మార్చుకొని ఎర్రకోట వైపు వెళ్లింది. వేలాది మంది రైతులు ఆ మార్గాన్ని అనుసరించి ఎర్రకోటను చుట్టుముట్టారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనల్లో పలువురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం కేంద్రం ఈ ఘటనపై దర్యాప్తు చేస్తోంది.

ఇవీ చదవండి..

మూడు రోజుల పాటు పల్స్‌పోలియో..

ఇంతకీ ఆయన ఎవరివైపు? శివసేన

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని