Ravana: రావణుడి వద్ద నిజంగానే విమానం ఉందా? తిరిగి మొదలుకానున్న పరిశోధన!

పురాణాలు, ఇతిహాసాలకు సంబంధించి ప్రజలకు ఎన్నో సందేహాలు ఉన్నాయి. వాటిలో ఒకటి.. శ్రీలంక చక్రవర్తి రావణాసురుడి వద్ద విమానం ఉండటం. సీతాదేవిని రావణాసురుడు విమానంలోనే అపహరించాడని, శ్రీలంకలో ఎయిర్‌పోర్టులు ఉన్నాయని చెబుతుంటారు. మరి ఇది ఎంత వరకు నిజం? రావణాసురుడి వద్ద నిజంగానే

Published : 16 Nov 2021 01:32 IST

కొలంబో: లంకాధీశుడు రావణుడి వద్ద నిజంగానే విమానాలు ఉన్నాయా? ఇతిహాసగాథ కూడా ఈ విషయాన్ని సుస్పష్టంగా చెప్పింది. అయితే, నిజమా? కాదా? అని తెలుసుకోవడానికి శ్రీలంక ప్రభుత్వం గతంలోనే ఓ పరిశోధక బృందాన్ని ఏర్పాటు చేసింది. అయితే, కరోనా కారణంగా ఆగిపోయిన పరిశోధనలు తిరిగి ప్రారంభంకానున్నాయి. విశేషమేమిటంటే.. ఈ కీలకమైన పరిశోధనలో భారత ప్రభుత్వం కూడా పాల్గొనాలని శ్రీలంక పరిశోధన బృందం కోరుతోంది.

ప్రపంచంలోనే మొదటిసారి విమానాన్ని ఉపయోగించింది రావణుడు అని శ్రీలంక ప్రజలు విశ్వసిస్తున్నారు. అయితే, ఇది కేవలం కల్పితమని కొట్టిపారేసే వాళ్లూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇందులో నిజమెంతో తెలుసుకోవడం కోసం రెండేళ్ల కిందట పౌరవిమానయాన నిపుణులు, చరిత్రకారులు, శాస్త్రవేత్తలు, పురావస్తు శాఖవారు సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో చర్చోపచర్చలు జరిగాయి. ఆఖరికి రావణుడు విమానంలో శ్రీలంక నుంచి భారత్‌కు ప్రయాణించాడని ఏకాభిప్రాయానికి వచ్చారు. 

శ్రీలంక ప్రభుత్వం ఈ అంశంపై పరిశోధన కోసం 5 మిలియన్‌ శ్రీలంకన్‌ రూపీస్‌ నిధులను విడుదల చేసింది. ఆ వెంటనే కరోనా మహమ్మారి ప్రబలడం.. లాక్‌డౌన్‌ తదితర పరిణామాలతో పరిశోధన ఆగిపోయింది. ప్రస్తుతం కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టడం.. అన్ని కార్యకలాపాలు యథాతథంగా కొనసాగుతుండటంతో శ్రీలంక ప్రభుత్వం పరిశోధనను తిరిగి ప్రారంభించేందుకు అంగీకరించింది. దీంతో ‘రావణుడి విమానం’పై పరిశోధనలు వచ్చే ఏడాది తిరిగి ప్రారంభం కానున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని