weather: గరిష్ఠ ఉష్ణోగ్రతల నుంచి రాజధానికి ఉపశమనం

దేశరాజధానిలో గత మూడు రోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం లభించే అవకాశాలు ఉన్నట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రత 2-3 డిగ్రీలు తగ్గే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. వాయుగుండాలు, మేఘాలు ఏర్పడనున్నట్లు చెబుతోంది. గత కొన్ని రోజులుగా ఉత్తర భారతదేశంలోని

Published : 13 Apr 2022 16:56 IST

దిల్లీ: దేశ రాజధానిలో గత మూడు రోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం లభించే అవకాశాలు ఉన్నట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రత 2-3 డిగ్రీలు తగ్గే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. వాయుగుండాలు, మేఘాలు ఏర్పడనున్నట్లు చెబుతోంది. గత కొన్ని రోజులుగా ఉత్తర భారతదేశంలోని 40 డిగ్రీల సెల్సియస్‌కు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఐఎండీ సీనియర్‌ శాస్త్రవేత్త జెనామణి మాట్లాడుతూ ఉష్ణోగ్రతల పెరుగుదల ముగిసిందని అన్నారు. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, దిల్లీ, జమ్ము, కశ్మీర్‌, పంజాబ్‌ , హరియాణా, హిమాచల్‌ ప్రదేశ్‌లలో వేడి గాలులు వీస్తాయన్నారు. ఏప్రిల్‌ 9, 10, 11 తేదీల్లో దిల్లీలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అన్నారు. గత 72 ఏళ్లలో ఈ స్థాయిలో నమోదు కావడం ఇదే మొదటి సారన్నారు. ఏప్రిల్‌ 9 న గరిష్ఠంగా 42.4 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే 13 రోజుల్లో వడగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని చెప్పారు. రాజస్థాన్‌లో ఏప్రిల్‌ 16 నాటికి హీట్‌ వేవ్‌ చూసే అవకాశం ఉందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని