అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగింపు

అంతర్జాతీయ ప్రయాణికుల విమాన సర్వీసులపై నిషేధాన్ని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) మరోసారి పొడిగించింది. జులై 31 వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని.

Published : 30 Jun 2021 14:38 IST

దిల్లీ: అంతర్జాతీయ ప్రయాణికుల విమాన సర్వీసులపై నిషేధాన్ని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) మరోసారి పొడిగించింది. జులై 31 వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని పేర్కొంది. భారత్‌ నుంచి బయల్దేరే అంతర్జాతీయ ప్రయాణికుల విమానాలకు ఈ ఆంక్షలు వర్తిస్తాయని డీజీసీఏ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. కార్గో, డీజీసీఏ అనుమతులు పొందిన విమాన సర్వీసులకు మినహాయింపు ఉంటుందని తెలిపింది. కొవిడ్‌ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

గతేడాది మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయాయి. 2020 మే నుంచి వందేభారత్‌ మిషన్‌, ఎయిర్‌ బబుల్‌ ఒప్పందంలో భాగంగా కొన్ని విమానాలు నడుస్తున్నాయి. యూఎస్‌, యూకే, యూఏఈ, కెన్యా, భూటాన్‌, ఫ్రాన్స్‌ వంటి 24 దేశాలతో భారత్‌ ఈ తరహా ఒప్పందం చేసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని