Rhino: ఖడ్గ మృగాన్ని ఫోటో తీస్తే.. ఏం చేసిందో మీరే చూడండి!

సఫారీకి వెళ్లిన కొందరు పర్యాటకులు ఖడ్గమృగం ఫొటోలు తీసేందుకు ప్రయత్నించారు. దీంతో ఒక్కసారిగా అవి దాడి చేయడంతో గాయాలపాలయ్యారు.

Published : 27 Feb 2023 01:37 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సఫారీలో సరదాగా తిరుగుతూ.. కనిపించిన జంతువుల్ని ఫొటోలు తీయడమంటే ఎవరికైనా సరదానే. అయితే, కొన్నిసార్లు కథ అడ్డం తిరిగి అవి దాడి చేస్తాయి. అప్రమత్తంగా లేకపోతే ప్రాణాపాయం కూడా సంభవించొచ్చు. ఎక్కడ జరిగిందో తెలియదు గానీ.. ఓ సఫారీ వ్యాన్‌పై  వెళ్తున్న పర్యాటకులకు ఖడ్గమృగాల గుంపు ఎదురైంది. దీంతో డ్రైవర్‌ ఒక్కసారిగా వాహనాన్ని వెనక్కి పోనిచ్చాడు. కానీ, అప్పటికే అందులోని ఓ ఖడ్గమృగం వ్యాన్‌ను తన కొమ్ముతో ఢీ కొట్టింది. దీంతో అదుపుతప్పిన వాహనం పల్టీ కొట్టి పడిపోయింది. దీంతో ప్రయాణికులకు గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోను ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ (IFS) అధికారి సుశాంత్‌ నందా ట్విటర్‌లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. వైల్డ్‌లైఫ్‌ సఫారీల్లో పర్యటిస్తున్నప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదో ఈ వీడియో చెబుతోంది. అడవి జంతువుల గోప్యతకు భంగం కలిగించకూడదు. ఆత్మరక్షణ లేకుండా ముందుకెళ్లొద్దు. ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి ఆపద వాటిల్లలేదు సంతోషమే. కానీ, అన్ని సందర్భాల్లో ఇలాంటి అదృష్టం ఉండకపోవచ్చు’’ అని రాసుకొచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని