సీబీఐకి వ్యతిరేకంగా ఆర్జేడీ ఆందోళనలు.. కార్యకర్తలను వారించిన రబ్రీదేవి

బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ అవినీతి ఆరోపణలు

Updated : 21 May 2022 14:19 IST

పట్నా: బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌పై అవినీతి ఆరోపణలకు సంబంధించి ఆయన నివాసంపై సీబీఐ దాడులు నిర్వహించింది. అయితే.. సోదాలు జరుగుతోన్న ప్రాంతానికి చేరుకున్న ఆర్జేడీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఇదంతా భాజపా కుట్రగా నినాదాలు చేశారు. ఇంటి నుంచి బయటకు వెళ్తోన్న సీబీఐ అధికారులను కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో లాలూ సతీమణి రబ్రీదేవి కార్యకర్తలను వారించి తప్పుకోవాలని మందలించారు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన ఆమె.. పలువురు కార్యకర్తలపై చేయి చేసుకున్నారు. నిన్న ఉదయం నుంచి లాలూకు సంబంధించిన 15 చోట్ల సీబీఐ సోదాలు చేపట్టింది. పట్నాలో రబ్రీదేవిని 12 గంటల పాటు విచారించినట్లు సమాచారం.

2004 నుంచి 2009 వరకు కేంద్రంలో యూపీఏ హయాంలో లాలూ రైల్వే మంత్రిగా ఉన్నారు. 2008లో జరిగిన రైల్వే నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. కొందరు అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు వారి కుటుంబాల నుంచి లాలూ కుటుంబం భూములు, ఆస్తులు లంచంగా తీసుకుందని సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని