అజర్‌బైజాన్‌లో రాకెట్‌ దాడి

వివాదాస్పద నాగోర్నో-కరాబాఖ్‌ ప్రాంతంపై ఆధిపత్యం కోసం సాగిస్తున్న పోరులో అజర్‌బైజాన్‌పై  ఆర్మేనియా రాకెట్‌ దాడికి పాల్పడింది. ఈ ఘటనలో ఐదుగురు పౌరులు సజీవదహనమయ్యారు...

Published : 11 Oct 2020 17:08 IST

ఐదుగురు సజీవ దహనం.. 17 మందికి గాయాలు

బాకు: వివాదాస్పద నాగోర్నో-కరాబాఖ్‌ ప్రాంతంపై ఆధిపత్యం కోసం సాగిస్తున్న పోరులో అజర్‌బైజాన్‌పై ఆర్మేనియా రాకెట్‌ దాడికి పాల్పడింది. ఈ ఘటనలో ఐదుగురు పౌరులు సజీవదహనమయ్యారు. గంజా నగరంలోని ఓ ఇంటిపై రాకెట్‌ దాడి జరపడంతో మంటలు వ్యాపించి అందులో నివసించే ఐదుగురు పౌరులు దుర్మరణం పాలయ్యారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ‘ఆదివారం గంజాలోని ఓ ఇంట్లోకి రాకెట్‌ దూసుకెళ్లింది. అనంతరం తీవ్ర మంటలు వ్యాపించి ఆ బిల్డింగ్ పూర్తిగా కాలిపోయింది. మంటల్లో చిక్కుకున్న ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు’ అని స్థానిక ప్రభుత్వాధికారులు వెల్లడించారు. మరో 17 మంది గాయపడ్డట్లు తెలిపారు. ‘రాకెట్‌ దాడిలో మంటలు వ్యాపించి ఓ బిల్డింగ్‌ పూర్తిగా కాలిపోయింది. ఘటనలో ఐదుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాం. 17 మంది గాయపడ్డారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి’ అని ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని