Facebook: ఫేస్‌బుక్‌పై 150 బిలియన్‌ డాలర్ల పరువునష్టం దావా 

2021 ఫిబ్రవరిలో జరిగిన మయన్మార్‌ సైనిక తిరుగుబాటు సమయంలో తమకు వ్యతిరేకంగా సాగిన విద్వేష పూరిత ప్రసంగాలు పోస్టుకాకుండా అడ్డుకోవడంలో విఫలమైందని సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌పై రొహింగ్యా శరణార్థులు 150 బిలియన్‌ డాలర్ల పరువునష్టం దావా వేశారు.

Published : 08 Dec 2021 01:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: 2021 ఫిబ్రవరిలో జరిగిన మయన్మార్‌ సైనిక తిరుగుబాటు సమయంలో తమకు వ్యతిరేకంగా సాగిన విద్వేష పూరిత ప్రసంగాలు పోస్టుకాకుండా అడ్డుకోవడంలో విఫలమైందని సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌పై రొహింగ్యా శరణార్థులు 150 బిలియన్‌ డాలర్ల పరువునష్టం దావా వేశారు. ఈ మేరకు న్యాయ కంపెనీలు ఎడల్సన్‌ పీసీ, ఫీల్స్‌, ఎల్‌ఎల్‌సీలు రొహింగ్యా శరణార్థుల తరుపున అమెరికాలోని కాలిఫోర్నియా న్యాయస్థానంలో దావా వేశారు. ఫేస్‌బుక్‌లో పోస్టు అయిన ప్రసంగాలు తమపట్ల హంసకు కారణమయ్యాయని ఇందులో పేర్కొన్నారు. అయితే ఫిబ్రవరి1న తిరుగుబాటు జరిగిన తరువాత మయన్మార్‌ సైన్యానికి సంబంధించి సమాచారం పోస్టుకాకుండా నిషేధం విధించడంసహా పలు కట్టడి చర్యలు తీసుకున్నట్లు ఫేస్‌బుక్‌ తెలిపింది. మూడో వ్యక్తి పోస్టు చేసిన సమాచారంపై చర్యలు చేపట్టకుండా అమెరికా అంతర్జాలం చట్టం ప్రకారం తమకు రక్షణ ఉందని స్పష్టం చేసింది. పిటిషన్‌దారులకు కోర్టులో విజయం దక్కక పోవచ్చని పలువురు నిపుణులు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు.  
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని