Lalu Prasad Yadav: కిడ్నీ మార్పిడికి సింగపూర్‌ చేరుకొన్న లాలూ..!

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు డిసెంబర్‌ 5న కిడ్నీ మార్పిడి చేయనున్నారు. అందుకోసం ఆయన శనివారం సింగపూర్‌ చేరుకొన్నారు. 

Published : 27 Nov 2022 11:47 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ చేయించుకొనేందుకు బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ సింగపూర్‌ చేరుకొన్నారు. డిసెంబర్‌ 5వ తేదీన ఆయనకు అక్కడ కిడ్నీ మార్పిడి చేయనున్నట్లు సమాచారం. కుమార్తె రోహిణీ ఆచార్య ఆయనకు కిడ్నీ దానం చేయనున్నారు. ఆయన సింగపూర్‌ చేరుకోగానే భావోద్వేగంతో రోహిణీ ఓ ట్వీట్‌ చేశారు. ‘‘తండ్రి నీడన ఉన్న ప్రతిక్షణం సంతోషం సమీపంలోనే ఉంటుంది. ప్రతి సమస్యతో పోరాడటం మాకు నేర్పించారు. సమాజంలోని పేద, అణగారిన, దోపిడీకి గురవుతున్న వారికి హక్కులు కల్పించారు’’ అని పేర్కొన్నారు. 

లాలూ సింగపూర్‌ చేరుకొన్న వీడియోను ఈ ట్వీట్‌కు జత చేశారు. వీల్‌ ఛైర్‌లో ఉన్న లాలూకు కుమార్తె రోహిణీ పాదాభివందనం చేస్తున్న దృశ్యం ఇందులో ఉంది. ఇప్పటికే లాలూకు అండగా రోహిణీ పలు ట్వీట్లు చేశారు. తాను కిడ్నీ దానం చేస్తున్న అంశాన్ని కూడా వీటిల్లో ప్రస్తావించారు. కేవలం ఒక చిన్న కండరం ముక్కను మాత్రమే నా తండ్రికి ఇస్తున్నాను.. ఆయన కోసం నేను ఏమైనా చేస్తాను. మా నాన్న పూర్తి ఆరోగ్యంతో రావాలని ప్రార్థించండి అని ఆమె గతంలో ట్విటర్లో పేర్కొన్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని