Kiren Rijiju: ఆ ఫొటో మూడేళ్ల క్రితందేనా? తవాంగ్‌పై కిరణ్ రిజిజు ట్వీట్ వివాదాస్పదం!
రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు భాజపా- కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది.
దిల్లీ: చైనా (China) యుద్ధానికి సిద్ధమవుతోందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలతో అధికార భాజపా- కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు, భాజపా నాయకులు రాహుల్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాజాగా కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) చేసిన ఓ ట్వీట్‌ను ఆధారంగా చేసుకొని కాంగ్రెస్ విమర్శల దాడికి దిగుతోంది.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కౌంటర్‌గా రిజిజు (Kiren Rijiju) శనివారం ఓ ట్వీట్ చేశారు. ఇటీవల భారత్- చైనా సైనికుల మధ్య ఘర్షణ తలెత్తిన తవాంగ్ (Tawang)ప్రాంతం సురక్షితంగా ఉందని తెలిపారు. కావాల్సిన స్థాయిలో బలగాలను మోహరించినట్లు పేర్కొన్నారు. దీనికి ఆయన జవాన్లతో ఉన్న ఓ ఫొటోను జత చేశారు. ఇప్పుడు ఆ ఫొటోయే వివాదంగా మారింది. అది 2019లో కిరణ్ రిజిజు (Kiren Rijiju) సందర్శించినప్పటి ఫొటో అని కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేశ్ ఆరోపించారు. మూడేళ్ల క్రితం చిత్రాన్నే తిరిగి పోస్ట్ చేశారు అని తెలిపారు. దీనిపై పలువురు కాంగ్రెస్ నాయకులు స్పందిస్తూ దేశ భద్రతకు సంబంధించిన అంశాల్లో ప్రజలను ఇలా తప్పుదోవ పట్టించడం సమంజసం కాదని వ్యాఖ్యానించారు.
మరికొందరు కిరణ్ రిజిజు (Kiren Rijiju)కు మద్దతుగా నిలుస్తున్నారు. ఆయన ఎక్కడా ఇటీవల సందర్శించినట్లు పేర్కొనలేదని ట్విటర్‌లో కామెంట్ చేస్తున్నారు. గతంలోనే కావాల్సిన స్థాయిలో బలగాల్ని మోహరించి ఉంచామని ప్రజలకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారని సమర్థిస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
TTD: తిరుమల ఘాట్రోడ్లో ప్రమాదాల నివారణకు దీర్ఘకాలిక ప్రణాళికలు: ఈవో
-
India News
Elon Musk: మస్క్ తనయుడికి సందేహం.. దిల్లీ పోలీసుల రిప్లయ్!
-
India News
Wrestlers protest: బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయాల్సిందే.. లేదంటే..: రాకేశ్ టికాయత్ హెచ్చరిక
-
General News
Viveka Murder case: సునీత పిటిషన్‌పై విచారణ ఈనెల 5కి వాయిదా
-
General News
Ts News: దిల్లీలోని తెలంగాణ భవన్లో యువతి ఆత్మహత్యాయత్నం
-
Movies News
Raveena Tandon: సూపర్‌హిట్ రెయిన్ సాంగ్.. అక్షయ్ ముద్దు పెట్టకూడదని షరతు పెట్టా: రవీనా టాండన్