Rahul Gandhi: దురదృష్టవశాత్తు ఎంపీని అయ్యా: రాహుల్ క్లిప్‌ వైరల్‌.. భాజపా వ్యంగ్యాస్త్రాలు

కాంగ్రెస్(Congress) అగ్రనేత రాహుల్ గాంధీ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి భాజపాకు అస్త్రంగా మారాయి. ఆయన చేసిన వ్యాఖ్యల వీడియో క్లిప్‌ ప్రస్తుతం వైరల్‌గా మారింది. 

Updated : 17 Mar 2023 11:07 IST

దిల్లీ: ‘ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది’ అంటూ కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) బ్రిటన్‌లో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతుండగా.. తాజా మరోసారి వార్తల్లో నిలిచారు. గురువారం రాహుల్‌ విలేకరులతో  మాట్లాడుతూ పదాలు తప్పుగా వాడారు. దాంతో కేంద్రమంత్రులు, భాజపా(BJP) నేతలు రాహుల్‌పై విరుచుకుపడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..?

పార్లమెంట్‌ వాయిదా పడిన అనంతరం రాహుల్‌ పాల్గొన్న మీడియా సమావేశానికి చెందిన ఒక వీడియో క్లిప్ వైరల్‌గా మారింది.  అందులో రాహుల్ మాట్లాడుతూ..‘దురదృష్టవశాత్తు.. నేను పార్లమెంట్‌ సభ్యుడిగా ఉన్నాను’ అని ఆయన(Rahul Gandhi) అనడం కనిపిస్తోంది. వెంటనే ఆ మాటల వెనక ఉన్న తప్పిదాన్ని గుర్తించిన జైరాం రమేశ్‌.. రాహుల్ వైపు వంగి వాటిని సరిచేశారు. ‘దురదృష్టవశాత్తు, నేను పార్లమెంట్‌ సభ్యుడినయ్యానని వారు జోక్‌ చేయగలరు’ అని మార్చిచెప్పమన్నారు. అప్పుడు రాహుల్‌..‘ఇక్కడ నేను మీకు ఒక స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాను. మీ దురదృష్టం కొద్దీ నేను పార్లమెంట్‌ సభ్యుడిగా ఉన్నాను’ అంటూ భాజపానుద్దేశించి అన్నారు. కానీ, అప్పటికే ఈ క్లిప్‌ను భాజపా వైరల్‌ చేసింది. 

దీనిపై కేంద్రమంత్రి పీయూశ్‌ గోయల్‌ స్పందిస్తూ.. ‘దురదృష్టవశాత్తు.. దీనిపై మాట్లాడటానికి మా దగ్గర పదాలు లేవు’ అని వ్యంగ్యంగా స్పందించారు. ఇది నిజంగా దురదృష్టమంటూ మరో మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ వీడియోను పోస్టు చేశారు. కాగా, ఈ విమర్శలపై జైరాం రమేశ్‌ స్పందిస్తూ..  ‘మళ్లీ భాజపా తన ఫేక్ న్యూస్ మెషిన్‌కు పనిచెప్పింది. రాహుల్ తన మాటలపై అప్పుడే స్పష్టత ఇచ్చారు. మేం ఎటవంటి టెలిప్రాంప్టర్లు లేకుండా మీడియాతో మాట్లాడతాం. అదానీ స్కాంను పక్కదోవపట్టించేందుకు ఇది మరో ప్రయత్నం’ అంటూ మండిపడ్డారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని