Watch: ఆ వాచీ విలువ రూ.27 కోట్లు!.. స్వాధీనం చేసుకున్న కస్టమ్స్‌ అధికారులు

దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఖరీదైన 7 వాచీలను కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.27 కోట్లకు పైగా ఉంటుందని చెబుతున్నారు. నిందితుడు దుబాయ్‌ నుంచి వచ్చినట్లు అధికారులు గుర్తించారు.

Published : 07 Oct 2022 01:34 IST

దిల్లీ: దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఖరీదైన 7 వాచీలను కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.27 కోట్లకు పైగా ఉంటుందని చెబుతున్నారు. నిందితుడు దుబాయ్‌ నుంచి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. అతడి నుంచి వాచీలతోపాటు వజ్రాలు పొదిగిన ఓ బ్రాస్‌లెట్‌, ఐఫోన్‌ 14 ఫోన్‌ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సుంకాలను తగ్గించుకునేందుకే కొందరు ఇలాంటి విలాసవంతమైన వస్తువులను అక్రమంగా రవాణా చేస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న వాచీల్లో ఒకటి అమెరికాకు చెందిన ప్రముఖ ఆభరణాల సంస్థ జాకబ్‌ అండ్‌ కో తయారు చేసింది. దీనిని బంగారం, విలువైన వజ్రాలతో తయారు చేసినట్లు కస్టమ్స్‌ అధికారులు తెలిపారు. ఈ ఒక్క వాచీ విలువే రూ.27,09,26,051 ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మరొకటి స్విట్జర్లాండ్‌లో తయారైనట్లు గుర్తించారు.  వీటిలో రోలెక్స్‌, పియాజెట్ సంస్థలు తయారు చేసిన వాచీలున్నాయి. ఈ వాచీలన్నింటి విలువ దాదాపు 60 కిలోల బంగారంతో సమానంగా ఉంటుందని దిల్లీ ఎయిర్‌పోర్టు కస్టమ్స్‌ అధికారులు చెబుతున్నారు.


Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని