Investments: జమ్మూకశ్మీర్‌కు పెట్టుబడుల వెల్లువ: కేంద్రం

నిత్యం ఉగ్రవాదుల దాడులు, తుపాకీ మోతలతో దద్దరిల్లిన జమ్మూకశ్మీర్‌ అభివృద్ధి బాటలో పయనిస్తోంది. సరికొత్త పారిశ్రామిక విధానంతో ఈ ఏడాది భారీగా పెట్టుబడులు వచ్చిపడుతున్నాయి.

Published : 14 Dec 2022 01:48 IST

దిల్లీ: జమ్మూకశ్మీర్‌లో అధికార యంత్రాంగం రూపొందించిన ప్రత్యేక పారిశ్రామిక విధానంతో భారీగా పెట్టుబడులు వచ్చిపడుతున్నాయి. పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే వారికి జోన్‌ల వారీగా ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పలువురు పారిశ్రమికవేత్తలు పెట్టుబడుల పట్ల ఆసక్తి చూపుతున్నారు. గతంలో రూ.వెయ్యి కోట్లు కూడా మించని పెట్టుబడులు ఈ ఏడాది మాత్రం భారీ స్థాయిలో వచ్చిపడుతుండటం విశేషం. ఇప్పటివరకు జమ్మూకశ్మీర్‌కు రూ.64 వేల కోట్ల ప్రతిపాదనలు రాగా.. ఇప్పటికే రూ.2,500 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్‌ రాయ్‌ లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలను వెల్లడించారు. జమ్మూకశ్మీర్‌లో 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.840.55 కోట్ల పెట్టుబడులు రాగా.. 2018-19లో రూ.590.97 కోట్లు, 2019-20లో రూ.296.64కోట్లు; 2020-21లో రూ.412.74 కోట్లు; 2021-22లో రూ.376.21 కోట్లు వచ్చాయని సమాధానంలో వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని