
Published : 10 Apr 2021 13:22 IST
ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్‌కు కరోనా
నాగ్‌పూర్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భగవత్ కరోనా బారిన పడ్డారు. ఆయనను నాగ్‌పూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించినట్లు ఆరెస్సెస్ తెలిపింది. ‘రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధినేత మోహన్ భగవత్ కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు ఉండటంతో కొవిడ్ పరీక్షలు చేయగా.. అందులో పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆయన నాగ్‌పూర్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు’ అని పేర్కొంది. ఆయనకు కొవిడ్ వార్డులో చికిత్స అందిస్తున్నామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పాయి.
ఇవీ చదవండి
Advertisement
Tags :