C.1.2 Variant: అప్రమత్తమైన భారత్‌.. కొవిడ్‌ నెగెటివ్‌ తప్పనిసరి జాబితాలో మరో ఏడు దేశాలు

విదేశాల్లో కొత్తగా కొవిడ్‌ ‘సి.1.2’ వేరియంట్‌ కేసులు విస్తరిస్తున్న నేపథ్యంలో భారత్‌ అప్రమత్తమైంది. ఇదివరకు మధ్య ప్రాచ్య దేశాలతోపాటు యూరప్‌ ఖండం నుంచి వచ్చేవారికి ఆర్టీ-పీసీఆర్‌ నెగెటివ్‌ ధ్రువపత్రాలు తప్పనిసరి చేసిన కేంద్రం.. తాజాగా...

Published : 02 Sep 2021 23:01 IST

దిల్లీ: విదేశాల్లో కొత్తగా కొవిడ్‌ ‘సి.1.2’ వేరియంట్‌ కేసులు విస్తరిస్తున్న నేపథ్యంలో భారత్‌ అప్రమత్తమైంది. ఇది వరకు మధ్య ప్రాచ్య దేశాలతో పాటు యూరప్‌ ఖండం నుంచి వచ్చే వారికి ఆర్టీ-పీసీఆర్‌ నెగెటివ్‌ ధ్రువపత్రాలు తప్పనిసరి చేసిన కేంద్రం.. తాజాగా గురువారం మరో ఏడు దేశాలను ఈ జాబితాలోకి చేర్చింది. వాటిలో చైనా, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌, బోట్స్వానా, మారిషస్‌, న్యూజిలాండ్‌, జింబాబ్వే ఉన్నాయి. ఆర్టీ- పీసీఆర్‌ పరీక్ష సైతం గడిచిన 72 గంటల్లోపూ చేసిందై ఉండాలని తాజా మార్గదర్శకాల్లో పేర్కొంది.

బృహన్ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్ సైతం సెప్టెంబర్ 3 నుంచి నగరానికి చేరుకునే అంతర్జాతీయ ప్రయాణికులకు ఆర్టీ- పీసీఆర్‌ పరీక్షలు తప్పనిసరి చేసింది. మరోవైపు జన్యు మార్పిడి పరిశీలనకుగానూ కొవిడ్‌ పాజిటివ్‌గా తేలిన అంతర్జాతీయ ప్రయాణికుల నమూనాలను పంపాలని కేంద్ర ఆరోగ్యశాఖ.. రాష్ట్రాలను కోరింది. ‘సి.1.2’ వేరియంట్‌ తొలిసారి దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన విషయం తెలిసిందే. క్రమంగా చైనా, కాంగో, మారిషస్‌, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌, పోర్చుగల్‌, స్విట్జర్లాండ్‌ దేశాలకూ విస్తరించింది. ఈ రకానికి యాంటీబాడీల నుంచి తప్పించుకునే, వేగంగా వ్యాప్తి చెందే గుణాలు ఉన్నాయని శాస్త్రవేత్తల అధ్యయనాల్లో తేలడంతో ఆయా దేశాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని