Sonia gandhi: సోనియా గాంధీ ఇంటికి అద్దె చెల్లించలేదట..!

కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ తన అధికారిక నివాసానికి అద్దె చెల్లించలేదట. ఆమెతో పాటు పలువురు కాంగ్రెస్‌ నేతలు తమ ఆధ్వర్యంలో ఉన్న నివాసాలు, ఆస్తులకు అద్దె కట్టలేదని తెలుస్తోంది. సుజిత్ పటేల్ అనే కార్యకర్త ఆర్టీఐ దరఖాస్తు దాఖలు చేయగా..కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వివరాలు ఇచ్చింది. 

Updated : 10 Feb 2022 19:05 IST

దిల్లీ: కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ తన అధికారిక నివాసానికి అద్దె చెల్లించలేదట. ఆమెతో పాటు పలువురు కాంగ్రెస్‌ నేతలు తమ ఆధ్వర్యంలో ఉన్న నివాసాలు, ఆస్తులకు అద్దె కట్టలేదని తెలుస్తోంది. సుజిత్ పటేల్ అనే కార్యకర్త ఆర్టీఐ దరఖాస్తు దాఖలు చేయగా..కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వివరాలు ఇచ్చింది. 

అక్బర్ రోడ్డులోని కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంపై రూ.12,69,902 అద్దె పెండింగ్‌లో ఉంది. డిసెంబర్ 2012లో దానికి చివరిసారిగా అద్దె చెల్లించారు. అలాగే జన్‌పథ్‌రోడ్డులోని సోనియా గాంధీ నివాసానికి సంబంధించి రూ.4,610 అద్దె ఇవ్వాల్సి ఉంది. 2020 సెప్టెంబర్‌లో చివరగా అద్దె మొత్తం అందింది. అలాగే సోనియా వ్యక్తిగత కార్యదర్శి విన్సెంట్ జార్జ్‌ నివసిస్తోన్న ఇంటికి 2013లో చివరిసారి అద్దె ఇచ్చారు. చాణక్యపురిలో ఉన్న ఆ బంగ్లాపై రూ.5,07,911 అద్దె పెండింగ్ ఉంది. 

హౌసింగ్ నిబంధనల ప్రకారం.. జాతీయ, రాష్ట్ర స్థాయి పార్టీలకు మూడేళ్లపాటు వసతి సౌకర్యం ఉంటుంది. అనంతరం ఆ పార్టీలు ప్రభుత్వ బంగ్లాలను ఖాళీ చేసి, సొంతంగా కార్యాలయాలను నిర్మించుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అక్బర్ రోడ్డులోని కార్యాలయంతో పాటు, మరో రెండు బంగ్లాలను 2013లోనే కాంగ్రెస్ పార్టీ ఖాళీ చేయాల్సి ఉండగా.. ఆ పార్టీ మాత్రం పలుమార్లు పొడిగింపు వెసులుబాటును ఉపయోగించుకుంది. అలాగే 2020లో లోధి రోడ్డులోని బంగ్లాను నెల రోజుల్లో ఖాళీ చేయాలని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీకి నోటీసులు అందాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు