
Published : 06 Nov 2021 23:00 IST
Corona Virus: రష్యాలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు
మాస్కో: కరోనా కోరల్లో చిక్కుకుని రష్యా అల్లాడిపోతోంది. శనివారం ఒక్క రోజే అక్కడ 41,335 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి దాకా నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం. వైరస్ నియంత్రణ దృష్ట్యా.. దేశ వ్యాప్తంగా అక్టోబర్ 30 నుంచి నవంబర్ 11 వరకు జీతంతో కూడిన సెలవులు మంజూరు చేస్తూ పుతిన్ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
దేశంలో అభివృద్ధి చేసిన స్పుత్నిక్ టీకాపై అక్కడి ప్రభుత్వం ఎన్నో ఆశలు పెట్టుకున్నా.. అక్కడి ప్రజలు మాత్రం టీకా వేయించుకునే విషయంలో ఏ మాత్రం ఆసక్తి ప్రదర్శించడం లేదు. కేవలం 32 శాతం మంది మాత్రమే పూర్తిగా టీకాలు పొందారు. ఇప్పటి వరకూ సుమారు 87 లక్షల కేసులు నమోదు కాగా.. సెకెండ్ వేవ్‌లో ప్రపంచంలో అత్యంత నష్టపోయిన దేశాల్లో రష్యా ఒకటిగా నిలిచింది.
ఇవీ చదవండి
Tags :