అంతర్జాతీయ ప్రయాణాలకు రష్యా అనుమతి

భారత్‌తో పాటు పలు దేశాల అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు అనుమతిస్తున్నట్లు రష్యా శనివారం వెల్లడించింది. ఈ మేరకు రష్యా రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

Published : 30 Jan 2021 18:48 IST

భారత్‌తో పాటు మరికొన్ని దేశాలకు

దిల్లీ: భారత్‌తో పాటు పలు దేశాల అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు అనుమతిస్తున్నట్లు రష్యా శనివారం వెల్లడించింది. ఈ మేరకు రష్యా రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘ రష్యా కొవిడ్‌-19 ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సెంటర్‌ సూచన మేరకు అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు రష్యా ప్రభుత్వం అనుమతినిచ్చింది. భారత్‌తో పాటు మరికొన్ని దేశాలు ఇందులో ఉన్నాయి.’’ అని వారు పేర్కొన్నారు. వారానికి రెండు సార్లు దిల్లీ నుంచి మాస్కోకు విమానాలు నడవనున్నట్లు సమాచారం. విద్యార్థి వీసాలతో సహా భారతీయులకు వీసాలిచ్చే కార్యక్రమం తిరిగి కొనసాగనుందని వారు తెలిపారు. ఈ-వీసాలను ఇచ్చేందుకు మరికాస్త సమయం పడుతుందన్నారు. ప్రయాణీకులు తప్పనిసరిగా కొవిడ్‌-19 నెగెటివ్‌ రిపోర్టుతో పాటు అన్ని వైద్య పత్రాలను తెచ్చుకోవాలని వారు ఆ ప్రకటనలో సూచించారు.

ఇవీ చదవండి..

గణతంత్ర ఘటనలపై మోదీ ఏమన్నారంటే..

దిల్లీ పేలుడు..వారి పనేనా?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని