Published : 24 Dec 2021 22:02 IST

Google: గూగుల్‌కు భారీ జరిమానా!

మాస్కో: ప్రముఖ సెర్చింజన్‌ దిగ్గజ గూగుల్‌కు రష్యాలో మరోసారి షాక్‌ తగిలింది. నిషేధిత కంటెంట్‌ని తొలగించడంలో విఫలమైనందున రష్యా కోర్టు భారీ జరిమానా విధించింది. స్థానికంగా నిషేధం విధించిన సమాచారాన్ని తొలగించడంలో పదేపదే నిర్లక్ష్యం వహించినందుకు గానూ ట్యాగన్‌స్కీ జిల్లా న్యాయస్థానం దాదాపు 7.2 బిలియన్‌ రూబెల్స్‌ (98.4మిలియన్‌ డాలర్లు) జరిమానా వేసింది. అయితే, దీనిపై టెక్‌ దిగ్గజం గూగుల్‌ స్పందించింది. కోర్టు డాక్యుమెంట్‌ని అధ్యయనం చేసిన అనంతరం తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. 

మరోవైపు, మాదకద్రవ్యాల దుర్వినియోగం, ఆయుధాలు, పేలుడు పదార్థాలకు సంబంధించిన కంటెంట్‌ని ప్రక్షాళన చేయడంలో విదేశీ సామాజిక మాధ్యమ సంస్థలు విఫలమవుతున్నాయంటూ రష్యా ఆరోపిస్తోంది. తమ దేశం నిషేధించిన కంటెంట్‌ని తొలగించేందుకు ఆయా సంస్థల అధికారులపై ఒత్తిడిని పెంచుతూ వస్తోంది. అలాగే, రష్యా పౌరుల వ్యక్తిగత డేటాను తమ దేశంలోనే నిల్వ చేయాలంటూ రష్యా అధికారులు ఆయా సంస్థల్ని డిమాండ్‌ చేస్తున్నారు. లేకపోతే జరిమానాలు/ నిషేధం విధించే అవకాశం ఉందంటూ హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. గూగుల్‌కు రష్యాలో జరిమానాలు కొత్తేం కాదు. ఈ ఏడాదిలోనే రష్యా కోర్టులు గూగుల్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్‌కు ఇదే తరహాలో జరిమానాలు విధించాయి.

Read latest National - International News and Telugu News

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని