Published : 25 Jul 2022 02:07 IST

Monkeypox: కరోనా జాగ్రత్తలే మంకీపాక్స్‌కు విరుగుడు!

దిల్లీ: దేశంలో మంకీపాక్స్‌ (Monkeypox) కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే నలుగురిలో ఈ వైరస్‌ను గుర్తించారు. ఆదివారం దిల్లీలో బయటపడిన కేసులో.. బాధితుడు ఎలాంటి విదేశీ ప్రయాణాలు చేయలేదని తేలడం ఆందోళన కలిగించే అంశం. ఈ నేపథ్యంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మంకీపాక్స్‌ కట్టడికి కరోనా (corona virus)  తరహాలోనే జాగ్రత్తలు పాటించాలని వెల్లడిస్తున్నారు. దిల్లీలోని ప్రముఖ లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ ఆసుపత్రి వైద్యుడు డా.సురేశ్‌ కుమార్‌ ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. మంకీపాక్స్‌ను అడ్డుకోవాలంటే కరోనా తరహాలోనే మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని తెలిపారు.

మంకీపాక్స్‌ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని డా.సురేశ్‌ సూచించారు. విదేశీ ప్రయాణాలు చేసినవారికి ఈ వ్యాధి సోకే అవకాశాలు ఎక్కవ అని, వారు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడేవారు అన్ని జాగ్రత్తలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. అన్ని జాగ్రత్తలు పాటిస్తే 99శాతం ఈ వైరస్‌ను నివారించవచ్చని తెలిపారు.

పశ్చిమ ఆఫ్రికాలో మొదలైన ఈ మంకీపాక్స్‌ ఇప్పటివరకు 75 దేశాలకు విస్తరించింది. 16వేల మంది ఈ వైరస్ బారినపడ్డారు. కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో అప్రమత్తమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మంకీపాక్స్‌ను గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీగా (global health emergency) ప్రకటించింది. సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అథనోమ్‌కు నిపుణుల కమిటీ సూచించిన నేపథ్యంలో శనివారం ఈ ప్రకటన వెలువడింది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని