Published : 16 Jan 2022 03:57 IST

Salman Khan: కించపరిచేలా వ్యాఖ్యలు.. ఓ వ్యక్తిపై సల్మాన్‌ఖాన్‌ దావా

ముంబయి: మీడియా, సామాజిక మాధ్యమాల్లో అవమానకర వ్యాఖ్యలతో తన పరువు తీస్తున్నారంటూ ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సల్మాన్ ఖాన్ ఓ వ్యక్తిపై కేసు వేశారు. పన్వేల్‌లోని తన ఫామ్‌హౌస్‌ సమీపంలో ఉండే వ్యక్తి కేతన్‌ కక్కడ్‌పై ముంబయి సిటీ సివిల్‌ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. వెంటనే ఆయా మాధ్యమాల్లో సల్మాన్‌కు వ్యతిరేకంగా ఉన్న కంటెంట్‌ను తొలగించేలా లేదా బ్లాక్ చేసేలా ఆదేశాలు జారీ చేయాలని ఆయన న్యాయ బృందం శుక్రవారం కోర్టును కోరింది. ముంబయిలోని మలాడ్‌ ప్రాంతానికి చెందిన కేతన్ కక్కడ్‌కు సల్మాన్ ఖాన్ ఫామ్‌హౌస్ సమీపంలో భూమి ఉన్నట్లు సమాచారం.

సల్మాన్‌ న్యాయవాదుల వివరాల ప్రకారం.. కేతన్ నెల రోజుల క్రితం ఓ యూట్యూబ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సల్మాన్‌ను కించపరిచేలా మాట్లాడాడు. ఈ క్రమంలో కేతన్‌తోపాటు మరో ఇద్దరు వ్యక్తులను, గూగుల్, యూట్యూబ్, ట్విటర్, ఫేస్‌బుక్ తదితర సోషల్ మీడియా సంస్థలనూ ఈ కేసులో చేర్చారు. సల్మాన్‌ను దూషిస్తూ, అవమానిస్తూ పోస్టులు పెట్టడం, కంటెంట్‌ అప్‌లోడ్‌ చేయడం, ట్వీట్లు, ఇంటర్వ్యూలు, ప్రింటింగ్, పబ్లిషింగ్, బ్రాడ్‌కాస్టింగ్ తదితర అన్ని మార్గాలపై నిషేధం విధించేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని సల్మాన్‌ న్యాయ బృందం కోర్టును కోరింది.

మరోవైపు కేతన్‌ తరఫు న్యాయవాదులు ఈ నిషేధాన్ని వ్యతిరేకిస్తూ.. తమ వాదనలు వినిపించేందుకు కొంత సమయం ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. విచారణకు ఒక రోజు ముందు మాత్రమే తమకు కేసు పత్రాలు అందాయని, మొత్తం వ్యవహారాన్ని పరిశీలించేందుకు సమయం లభించలేదని తెలిపారు. సల్మాన్ ఖాన్ ఈ దావా వేసేందుకు ఒక నెల తీసుకోగా, కక్కడ్‌కు కూడా సమాధానం చెప్పేందుకు టైం ఇవ్వాలని కోరారు. దీంతో కోర్టు కేతన్‌కు అనుకూలంగా సమయం మంజూరు చేసింది. కేసును జనవరి 21కి వాయిదా వేసింది.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని