Salman khan: సల్మాన్‌ ఖాన్‌కు బెదిరింపు ఈ-మెయిల్!

salman khan: బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు వచ్చినట్టు ఆయన టీమ్‌ బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Published : 19 Mar 2023 23:31 IST

ముంబయి: బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌(Salman khan)కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ నుంచి ఆయనకు ఈ-మెయిల్‌ ద్వారా బెదిరింపులు వచ్చాయని..దీనిపై  ముంబయిలోని బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఆయన టీమ్‌ వెల్లడించింది. తాజాగా మరోసారి సల్మాన్‌ ఖాన్‌కు వచ్చిన  బెదిరింపులకు సంబంధించిన ఈ-మెయిల్‌ను పరిశీలిస్తున్నట్టు ముంబయి పోలీసులు తెలిపారు. గ్యాంగ్‌స్టర్‌ నుంచి సల్మాన్‌ఖాన్‌కు బెదిరింపులు రావడం ఇది తొలిసారేం కాదు. 2018లో  కృష్ణజింకలను వేటాడిన కేసు విచారణ జరుగుతున్న సమయంలో ఆ వన్యప్రాణుల్ని వేటాడటం ద్వారా సల్మాన్‌ఖాన్‌ బిష్ణోయ్‌ల మనోభావాలను దెబ్బతీశారంటూ లారెన్స్‌ బిష్ణోయ్‌ వ్యాఖ్యానించాడు. చివరకు ఈ కేసులో సల్మాన్‌ నిర్దోషిగా విడుదలయ్యారు.

గతేడాది లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌నుంచి ఆయన ప్రాణాలకు ముప్పు ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో నవంబర్‌లో మహారాష్ట్ర ప్రభుత్వం ముంబయి పోలీసులతో అప్పటికే ఉన్న ఎక్స్‌ గ్రేడ్‌ భద్రతను Y+గా అప్‌గ్రేడ్‌ చేసింది. దీంతో ఇద్దరు సాయుధ గార్డ్‌లు సల్మాన్‌కు అనునిత్యం భద్రతగా ఉంటున్నారు. ఆయన ఇంటి వద్ద కూడా ఇద్దరు భద్రతా సిబ్బంది నిత్యం పహారా కాస్తున్నారు.  గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ ప్రస్తుతం దిల్లీ జైలులో ఉన్న విషయం తెలిసిందే. పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు రావడంతో పోలీసులు అరెస్టు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని