Sameer Wankhede: ఆయన పత్రాలు సరైనవే.. వాంఖడేకు క్లీన్‌చిట్‌ ఇచ్చిన సీఎస్‌సీ

గత ఏడాది డ్రగ్స్ కేసులో బాలీవుడ్‌ స్టార్ షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ను అదుపులోకి తీసుకొని వార్తల్లో నిలిచారు సమీర్‌ వాంఖడే.

Published : 13 Aug 2022 18:29 IST

ముంబయి: గత ఏడాది డ్రగ్స్ కేసులో బాలీవుడ్‌ స్టార్ షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ను అదుపులోకి తీసుకొని వార్తల్లో నిలిచారు సమీర్‌ వాంఖడే. ఆ సమయంలో ఆయన ఎన్‌సీబీ జోనల్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆ తర్వాత కేసు విషయంలో వివాదాలకు కేంద్ర బిందువయ్యారు. కాగా, ఆయనకిప్పుడు కుల ధ్రువీకరణ ప్రతాల విషయంలో ఊరట లభించింది. కొన్నినెలల పాటు నడిచిన వివాదంలో కాస్ట్‌ స్క్రుటినీ కమిటీ(సీఎస్‌సీ) క్లీన్‌ చిట్ ఇచ్చింది. 

వాంఖడే వద్ద ఉన్న కులధ్రువీకరణ పత్రాన్ని ఈ కమిటీ సమర్థించింది. వాంఖడే పుట్టుకతోనే ముస్లిం కాదని తెలిపింది. సమీర్, ఆయన తండ్రి హిందూమతాన్ని త్యజించలేదని వెల్లడించింది. అయితే ముస్లిం మతాన్ని మాత్రం స్వీకరించారని పేర్కొంది. వారిద్దరు హిందూ మతం కింద గుర్తించిన మహర్-37 షెడ్యూల్ క్యాస్ట్‌కు చెందినవారని చెప్పింది. ఈ క్లీన్‌చిట్‌పై సమీర్‌ వాంఖడే స్పందించారు. సత్యమేవజయతే అని ఒక్క మాటలో ట్వీట్‌ చేశారు. ‘నేను నిర్వర్తించిన విధుల్ని పక్కనపెట్టి, ఈ వివాదంలోకి నా కుటుంబాన్ని, చివరకు మరణించిన నా తల్లిని లాగడం కలచివేసింది’ అని వ్యాఖ్యానించారు. 

డ్రగ్స్‌ కేసులో గతేడాది అక్టోబరు 3న ఆర్యన్‌ ఖాన్‌ అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అప్పటి ఎన్‌సీబీ ముంబయి జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడే నేతృత్వంలో దర్యాప్తు చేపట్టారు. అయితే ఆ సమయంలో వాంఖడేపై అనేక విమర్శలు వచ్చాయి. డబ్బుల కోసం బ్లాక్‌మెయిల్‌ చేసేందుకే క్రూజ్‌ డ్రగ్స్‌ కేసులో ఆర్యన్‌ సహా పలువురిని అరెస్టు చేసినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. అంతేగాక, నకిలీ కుల ధ్రువీకరణ పత్రంతో ఉద్యోగం పొందినట్లు ఎన్‌సీపీ నేతలు ఆరోపించారు. దీంతో వాంఖడే రాజకీయ వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. తర్వాత ఆయనపై బదిలీల వేటు పడింది. 

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని